ఆరంభ నష్టాల నుంచి కోలుకున్న సూచీలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Apr 28 , 2026 | 10:05 AM
సోమవారం భారీ లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అయితే కాసేపటికే నష్టాల నుంచి కోలుకుని లాభాల బాట పట్టాయి. ఇరాన్ యుద్ధం విషయంలో స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
సోమవారం భారీ లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అయితే కాసేపటికే నష్టాల నుంచి కోలుకుని లాభాల బాట పట్టాయి. ఇరాన్ యుద్ధం విషయంలో స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కనిష్ఠాల వద్ద కొనుగోళ్లకు మొగ్గు చూపడం వల్ల సూచీలు నష్టాల నుంచి తేరుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. బ్యాంకింగ్ సెక్టార్ మాత్రం నష్టాల బాటలో సాగుతోంది (Indian stock market).
గత సెషన్ ముగింపు (77,303)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 300 పాయింట్ల నష్టంతో 77,094 వద్ద మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కోలుకుంది. ఉదయం 10:00 గంటల సమయంలో సెన్సెక్స్ 127 పాయింట్ల లాభంతో 77,430 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతం 70 పాయింట్ల లాభంతో 24,162 వద్ద కదలాడుతోంది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో నిప్పాన్, ఆయిల్ ఇండియా, కోల్ ఇండియా, ఆర్బీఎల్ బ్యాంక్, వొడాఫోన్ ఐడియా మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). ఫియోనిక్స్ మిల్స్, జైడుస్ లైఫ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎటర్నల్, యూనియన్ బ్యాంక్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 216 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 165 పాయింట్ల నష్టంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 94.47గా ఉంది.
ఇవి కూడా చదవండి..
న్యూజిలాండ్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ రంగాలకు లాభమే..
బంగారం కొనాలనుకుంటున్నారా.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..