Share News

ఎవరివో ఈ అస్థిపంజరాలు..!

ABN , Publish Date - Apr 28 , 2026 | 10:54 AM

రెండు నెలల కిందట అనంతపురం జిల్లా పరిగి మండలం, కర్ణాటక సరిహద్దులో ఓ అస్థిపంజరాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

ఎవరివో ఈ అస్థిపంజరాలు..!
Ananthapuam

  • సరిహద్దులో కలకలం

  • అవతల హత్య చేసి ఇక్కడ వేస్తున్నారా.. ?

హిందూపురం(అనంతపురం):

  • రెండు నెలల కిందట పరిగి మండలం, కర్ణాటక సరిహద్దులో ఓ అస్థిపంజరాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఈ అస్థిపంజరం ఎవరిదన్నది ఇప్పటికీ గుర్తు చిక్కలేదు.

  • ఈనెల 8న తూముకుంట పారిశ్రామికవాడలో గోళ్లాపురానికి వెళ్లే రైల్వే అండర్‌బ్రిడ్జి వద్ద ముళ్లపొదల మధ్య మృతదేహం లభ్యమైంది. అప్పటికే అది అస్థిపంజరంగా మారింది.


తాజాగా శనివారం అప్పలకుంట చెరువువద్ద ఓ అస్థి పంజరాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ మృతదేహాలు ఎవరివి అన్నది ఇప్పటికీ వివరాలు తెలియడం లేదు. ఇటీవల హిందూపురం సరిహద్దులో అస్థి పంజరాలు బయటపడటం కలకలం రేపుతోంది. హిందూపురం ప్రాంతం కర్ణాటకకు సరిహద్దుగా ఉండటంతో అక్కడ హత్య చేసి ఇక్కడ మృతదేహాలను పడేసి వెళ్తు న్నట్లు స్థానికులు చెబుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో ఇక్కడికే తీసుకొచ్చి హత్యచేసి పడేసి వెళ్లిన సంఘటనలు చాలానే ఉన్నాయి.


కర్ణాటకలోని తుమకూరు, చిక్కబళ్లాపురం, కోలార్‌, బెంగళూరు జిల్లాలు ఇక్కడికి వంద కిలోమీటరు దూరంలో ఉండటంతో అక్కడ హత్య చేసి అనుమానం రాకుండా మృతదేహాలను హిందూపురం ప్రాంతంలో పడేస్తున్నట్లు స్థానిక పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా హిందూపురం మండలంలో పారిశ్రామికవాడ ఉండటంతో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందినవారు కార్మికులుగా పనిచేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో గుర్తించడం కష్టంగా మారుతోంది.


ఇక్కడ పరిశ్రమలో పనిచేసే కార్మికులు అధిక శాతం ఎక్కడి నుంచి వచ్చారు? ఎప్పుడు వచ్చారు? ఏ పరిశ్రమలో పనిచేస్తున్నారనే ఆధారాలు వారి వద్ద లేకపోవడంతో అసలు పరిశ్రమలో పనిచేసే కార్మికులా లేక కర్ణాటకకు చెందినవారా అని గుర్తించే ప్రక్రియ పోలీసులకు తలనొప్పిగా మారింది. ఈ మృతదేహాలను స్థానికులు గుర్తించేసరికే అవి అస్థిపంజరాలుగా మారి కనిపిస్తున్నాయి. హిందూపురం మండలంలో నెలరోజుల వ్యవధిలో ఇలాంటి ఘటనలు రెండు వెలుగులోకి రావడంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం కొనాలనుకుంటున్నారా.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

అక్క అస్థిపంజరంతో బ్యాంకుకు.. ఒడిశాలో ఓ వ్యక్తి ఎంత అసహనానికి గురయ్యాడంటే..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 28 , 2026 | 10:54 AM