ఐపీఎల్ చరిత్రలోనే ఏకైక ఆటగాడిగా కోహ్లీ
ABN , Publish Date - Apr 28 , 2026 | 10:02 AM
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే 9 వేల పరుగుల మైలురాయి అందుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న(సోమవారం) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. ఇదే మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే 9 వేల పరుగుల మైలురాయి అందుకున్న మొట్టమొదటి ఆటగాడిగా నిలిచాడు. కోహ్లీకి దరిదాపుల్లో మరే ఆటగాడు కూడా లేకపోవడం గమనార్హం. తన హోమ్ గ్రౌండ్‌లో కోహ్లీ ఈ అద్వితీయమైన ఘనతను అందుకోవడం ప్రత్యేకం.
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు ముందు ఈ మైలురాయికి 11 పరుగుల దూరంలో నిలిచిన కోహ్లీ.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో సింగిల్ తీసి ఈ ఘనతను అందుకున్నాడు. 9 వేల మైలురాయిని సాధించేందుకు కోహ్లీ 6732 బాల్స్ ఆడాడు. కోహ్లీ ఈ 9వేల పరుగులను ఆర్సీబీ ఫ్రాంచైజీ తరఫునే కోహ్లీ చేయడం విశేషం. ఇప్పటికే ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ టాప్‌లో ఉన్నాడు. అతని తర్వాత రోహిత్ శర్మ 7183 పరుగులతో రెండో స్థానంలో ఉండగా.. శిఖర్ ధావన్(6769), డేవిడ్ వార్నర్(6565), కేఎల్ రాహుల్(5580) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. 81 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించిన ఆర్సీబీ.. ఐపీఎల్ చరిత్రలోనే రెండో అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 16.3 ఓవర్లలో 75 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఆర్‌సీబీ 6.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 77 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లీ(23*), దేవదత్ పడిక్కల్(34*) అజేయంగా నిలిచారు.
ఇవి కూడా చదవండి:
బీడబ్ల్యూసీ కౌన్సిల్లో పీవీ సింధుకు కీలక పదవి
ఘోర ఓటమిలోనూ ఢిల్లీ బ్యాటర్ అరుదైన రికార్డు