అనంతపురంలో మరో వలపువల.. ఇన్‌స్టాగ్రామ్‌లో వల వేసి దోపిడి
ABN , Publish Date - Apr 28 , 2026 | 10:07 AM
అనంతపురంలో మరో వలపువల వెలుగులోకి వచ్చింది. గుత్తి టౌన్‌కు రావాలంటూ పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన యువకుడికి ఇన్‌స్టాగ్రామ్‌లో కర్నూలు జిల్లా జొన్నగిరికి చెందిన యువతి వలపు వల వేసింది. ఈ క్రమంలో ఆ యువకుడు గుత్తి టౌన్‌కు చేరుకున్నారు.
అనంతపురం , ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): అనంతపురంలో మరో వలపువల వెలుగులోకి వచ్చింది. గుత్తి టౌన్‌కు రావాలంటూ పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన యువకుడికి ఇన్‌స్టాగ్రామ్‌లో కర్నూలు జిల్లా జొన్నగిరికి చెందిన యువతి వలపు వల వేసింది. ఈ క్రమంలో ఆ యువకుడు గుత్తి టౌన్‌కు చేరుకున్నాడు. ఈ సమయంలో యువకుడిని నిర్మానుష్య ప్రదేశానికి యువతి తీసుకెళ్లింది. చీకట్లో ఆ యువకుడిపై దాడికి పాల్పడి డబ్బు, బంగారం, సెల్‌ఫోన్‌ను యువతి గ్యాంగ్ లాక్కొంది. దాడి నుంచి తప్పించుకుని సమీపంలో ఓ దాబా వద్దకు పరిగెత్తుకుంటూ బాధిత యువకుడు వెళ్లాడు.
ఈ దాడి ఘటన గురించి పోలీసుల దృష్టికి తీసుకెళ్లేందుకు యత్నించాడు ఆ యువకుడు. ఇంతలో అక్కడికి చేరుకున్న యువతి గ్యాంగ్.. పోలీసుల సమక్షంలోనే మరోసారి దాడికి పాల్పడింది. దాడి చేసిన వ్యక్తులు ఓ రాజకీయ పార్టీ నాయకుడికి సన్నిహితులమని బెదిరించారు. దీంతో కేసు వద్దంటూ బాధిత యువకుడు పోలీసులను వేడుకున్నాడు. దీంతో యువతి గ్యాంగ్‌ను వదిలిపెట్టారు పెద్దవడగూరు పోలీసులు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఇంధనాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు
ప్రయాణికుల సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండొద్దు: మంత్రి మండిపల్లి
Read Latest AP News And Telangana News And International News And Telugu News