ఏపీలో రాబోయే 3 గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
ABN , Publish Date - Oct 18 , 2026 | 04:46 PM
ఏపీలో రాబోయే 3 గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
అమరావతి, అక్టోబర్ 18: రాష్ట్రంలోని పలు జిల్లాలకు విపత్తుల నిర్వహణ సంస్థ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
నెల్లూరు, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలలో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. దానితోపాటు గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రజలు, సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మున్సిపల్ ఎన్నికలు.. మేయర్ అభ్యర్థులపై ఉత్కంఠ.. సీఎం నిర్ణయంపై ఆసక్తి
రాయచోటి, పుంగనూరు ఘటనలపై నివేదిక కోరాం.. చర్యలు తీసుకుంటాం: ఏపీ ఎస్ఈసీ
Read Latest AP News And Telugu News