తగ్గిన ఉష్ణోగ్రతలు
ABN , Publish Date - Jun 06 , 2026 | 10:40 AM
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గడంతో వాతావరణం చల్లబడింది.
38.7 డిగ్రీల గరిష్ఠానికి చేరిక
రెండు రోజులు వర్ష సూచన
హైదరాబాద్ సిటీ: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గడంతో వాతావరణం చల్లబడింది. నగరంలో శుక్రవారం 38.7డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండు రోజులపాటు సాయంత్రం, రాత్రి వేళల్లో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంటుందని బేగంపేట వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రతలు
గరిష్ఠం: 38.7 డిగ్రీలు
కనిష్ఠం: 27.0 డిగ్రీలు
గాలిలో తేమశాతం: 074 శాతం
ఈ వార్తలు కూడా చదవండి:
వాటర్ బోర్డు పేరుతో సైబర్ మోసాలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News