Share News

భారత్‌పై ఆంక్షల బెదిరింపులు మొదటికే మోసం తెస్తాయి: పుతిన్

ABN , Publish Date - Jun 06 , 2026 | 10:31 AM

భారతదేశ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గట్టి మద్దతు తెలిపారు. ఆంక్షల ద్వారా భారత్‌పై ఒత్తిడి తెచ్చే ఏ ప్రయత్నమైనా తిరగబెడుతుందని ఆయన అన్నారు. సార్వభౌమ దేశాలు తమ రక్షణ, ఆర్థిక భాగస్వాములను ఎంచుకునే స్వేచ్ఛను కలిగి ఉండాలని పుతిన్ నొక్కి చెప్పారు.

భారత్‌పై ఆంక్షల బెదిరింపులు మొదటికే మోసం తెస్తాయి: పుతిన్
Putin Says Sanctions Threats Against India Would Boomerang

న్యూఢిల్లీ, జూన్ 6: భారతదేశ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గట్టి మద్దతు తెలిపారు. ఆంక్షల ద్వారా భారత్‌పై ఒత్తిడి తెచ్చే ఏ ప్రయత్నమైనా తిరగబెడుతుందని ఆయన అన్నారు. సార్వభౌమ దేశాలు తమ రక్షణ, ఆర్థిక భాగస్వాములను ఎంచుకునే స్వేచ్ఛను కలిగి ఉండాలని పుతిన్ నొక్కి చెప్పారు. శుక్రవారం పుతిన్.. సెయింట్ పీటర్స్‌బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదిక (SPIEF)లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Su-57-new.jpgరష్యాతో సంబంధాలపై బాహ్య ఒత్తిడి ఉన్నప్పటికీ, భారత్ తన జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగానే స్థిరంగా వ్యవహరించిందని, భవిష్యత్తులో కూడా అలాగే కొనసాగిస్తుందని పుతిన్ అన్నారు. 'భారత్ ఎల్లప్పుడూ ఒక సార్వభౌమ దేశంగానే వ్యవహరిస్తుంది. ప్రధాని మోదీ నాయకత్వంలో, ఆంక్షల రూపంలో వచ్చే ఎలాంటి బెదిరింపులైనా తక్షణమే తిరగబెడతాయి' అని పుతిన్ పేర్కొన్నారు.


భారతదేశ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని నొక్కిచెబుతూ, పుతిన్.. 'భారతదేశం ఒక సార్వభౌమ దేశం, తమకు అత్యంత ఆధునికమైనవిగా, అత్యంత అనువైనవిగా భావించే ఉత్పత్తులను ఎంచుకోవడానికి దానికి స్వేచ్ఛ ఉంది. ఎవరు ఎలాంటి ఆంక్షలు విధించినా సరే, భారతదేశం ఎల్లప్పుడూ ఈ విధంగానే వ్యవహరిస్తుంది' అని స్పష్టం చేశారు. Su-57 లేదా S-500 వంటి ఫైటర్ జెట్లను భారత్ కొనుగోలు చేస్తే, అమెరికా నుంచి ఆంక్షల ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందన్న విషయంపై పుతిన్ పై విధంగా స్పందించారు.


అంతేకాదు.. భారత్‌కు అది అందజేయవద్దని కూడా మమ్మల్ని ఎవరూ ఆదేశించలేరని పుతిన్ తేల్చి చెప్పారు. న్యూఢిల్లీతో కుదిరిన ఒప్పందాలకు రష్యా కట్టుబడి ఉంటుందని ఆయన అన్నారు. మా భాగస్వాములకు, ముఖ్యంగా భారత్ వంటి దేశాలకు ఇచ్చిన హామీలకు తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామన్నారు. Su-57 చాలా మంచి యుద్ధ విమానమని.. బహుశా ప్రపంచంలో ఇదే అత్యాధునికమైనదని అని ఆయన తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

చురుగ్గా ‘నైరుతి’

హాస్టళ్లకు, గురుకులాలకు గ్రేడ్‌లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 06 , 2026 | 10:49 AM