Share News

తమిళనాడులోని 16 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం

ABN , Publish Date - Jun 05 , 2026 | 01:51 PM

దక్షిణ తమిళనాడు, పశ్చిమ కనుమలు, కోస్తా జిల్లాల్లో గురువారం విస్తారంగా వర్షాలు కురిశాయి.

తమిళనాడులోని 16 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం
Rains, IMD

చెన్నై: దక్షిణ తమిళనాడు, పశ్చిమ కనుమలు, కోస్తా జిల్లాల్లో గురువారం విస్తారంగా వర్షాలు కురిశాయి. అయితే.. కన్నియాకుమారి తీరంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో మరో మూడు రోజులు కన్నియాకుమారి, తిరునల్వేలి, పుదుకోట, నాగపట్టణం తదితర 16 జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశముందని నుంగంబాక్కంలోని వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ కనుమల వెంబడి కన్నియాకుమారి, తిరునల్వేలి, తెన్‌కాశి, తిరుప్పూర్‌, కోయంబత్తూరు, నీలగిరి, సేలం తదితర జిల్లాల్లో బుధవారం రాత్రి నుండి వర్షాలు కురుస్తున్నాయి.. కోవై జిల్లా పొల్లాచ్చిలోని ఆలియార్‌ డ్యాంలో నీటి ఉదృతి పెరిగింది.


తెన్‌కాశిలోని కుట్రాలంలోని ఐదు జలపాతాల్లో నీటి ప్రవాహం పెరగడంతో సందర్శకుల అనుమతి రద్దుచేశారు. పొరుగు రాష్ట్రమైన కేరళలో రుతుపవనాలు ప్రవేశించడం, మరోవైపు కన్నియాకుమారి తీరంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తేని, తిరుప్పూర్‌, దిండుగల్‌, తిరునల్వేలి జిల్లాల్లోని కొండ ప్రాంతాలు, ఈరోడ్‌, సేలం, ధర్మపురి, కృష్ణగిరి, తిరుపత్తూరు, వేలూరు, రాణిపేట, తిరువణ్ణామలై జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది.


xxx.jpgశుక్రవారం ఈ జిల్లాలతో పాటు కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో సముద్రంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, గురువారం నుండి ఈ నెల 10వ తేదీ వరకూ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే చెన్నై, శివారు ప్రాంతాల్లో వాతావరణంలో మార్పుల కారణంగా అక్కడక్కడ చిరుజల్లులు పడ్డాయి. శుక్రవారం ఒకటిరెండు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణశాఖ హెచ్చరించింది.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం’లాంటి కట్టుకథ!

తాజా నిబంధనల మేరకే పదోన్నతులు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 05 , 2026 | 02:00 PM