నైరుతి వచ్చేస్తోంది..
ABN , Publish Date - Jun 05 , 2026 | 01:16 PM
నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి. రెండు రోజుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనున్నాయి.
రెండు రోజుల్లో అనంతకు రుతుపవనాలు
అనంతపురం: నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి. రెండు రోజుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి రుతుపవనాలు ఆలస్యంగా రానున్నాయి. రెండేళ్ల క్రితం మే 29న కేరళకు... జూన్ 2న జిల్లాలోకి ప్రవేశించాయి. గతేడాది మే 26న కేరళకు... జూన్ 2న అనంతలోకి ప్రవేశించాయి. ఈ ఏడాది గురువారం కేరళను నైరుతిరుతుపవనాలు తాకాయి. రెండ్రోజుల్లో జిల్లాలోకి ప్రవేశించనున్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నానరు.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షం పడే అవకాశం ఉన్నట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త నారాయణస్వామి పేర్కొన్నారు. ఈసారి నైరుతి రుతుపవనాలు జిల్లాలోకి ప్రవేశించినా ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో వర్షాభావాన్ని తట్టుకునే స్వల్పకాలిక పంటలు సాగు చేసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News