నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం
ABN , Publish Date - Oct 13 , 2026 | 01:40 PM
ఆగ్నేయ బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశముందని చెన్నై వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
త్వరలో ‘ఈశాన్యం’ ఆగమనం
చెన్నై: ఆగ్నేయ బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశముందని చెన్నై వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీని ప్రభావంతో త్వరలోనే ఈశాన్య రుతుపవనాలు ప్రారంభయమ్యే అవకాశముందని తెలిపింది. దేశంలో నైరుతి రుతుపవనాలు ముగిసినప్పటికీ, ఇంకా పలు రాష్ట్రాల్లో వర్షం కురుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో ఈ రుతుపవనాలు నిష్క్రమిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ క్రమంలో ఆగ్నేయ బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో వేగంగా వీస్తున్న గాలుల కారణంగా వాతావరణంలో మార్పులు జరిగే అవకాశముందని తెలిపింది. వారం రోజులుగా కేరళం, శ్రీలంక ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అయితే, రాష్ట్రంలో వాతావరణంలో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదని, అయినప్పటికీ, పశ్చిమ కనుమల పరిసరాల్లో వర్షం కురుస్తున్నట్లు ఆ శాఖ తెలిపింది. తాజాగా, అండమాన్ దీవుల సమీపంలో కేంద్రీకృతమైన అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతోందని, దీని ప్రభావంతో ఈశాన్య రుతుపవనాలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశముందని తెలిపింది.
ఈ క్రమంలో, తమిళనాడు, పుదుచ్చేరిలో వర్షం కురిసే అవకాశముందని, ఈ నెల 14 నుంచి 18వ తేది వరకు అతిభారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గత ఏడాది అక్టోబరు 16న ప్రారంభమైన ఈశాన్య రుతుపవనాలు జనవరి 2 వరకు కొనసాగడంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో 43 సెం.మీ వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం ‘ఎల్‌నినో’ కొనసాగుతున్న కారణంగా నైరుతి లాగే ఈశాన్య రుతుపవన వర్షం కురుస్తుందా లేదా అంటూ రైతుల్లో ఆందోళన నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి:
అధికారం అజమాయిషీకి కాదు.. ప్రజలకు సాధికారత కల్పించాలి: మోదీ
తల్లి రెండో పెళ్లి చేసుకుందని.. కొడుకు ఎంత పని చేశాడంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News