రెయిన్ అలర్ట్.. పిడుగులతో కూడిన వర్షాలు
ABN , Publish Date - Jun 09 , 2026 | 04:07 PM
రాబోయే మూడు గంటల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొన్నారు.
అమరావతి, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): రాబోయే మూడు గంటల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు చెప్పుకొచ్చారు.
విజయనగరం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినట్లు ప్రఖర్ జైన్ వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని వివరించారు. అనకాపల్లి జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
కాకినాడ జిల్లాలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలవరం ప్రాంతంలో వర్షాలతో పాటు బలమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పిడుగులు పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలపడవద్దని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. ముఖ్యంగా రైతులు, మత్స్యకారులు వాతావరణ పరిస్థితులను నిరంతరం గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వాతావరణం ఒక్కసారిగా మారే అవకాశం ఉన్నందున ప్రజలు అధికారుల సూచనలను పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారులను సంప్రదించాలని ప్రఖర్ జైన్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. సీఎం తీవ్ర దిగ్భ్రాంతి
ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ సమావేశం.. హాజరుకానున్న చంద్రబాబు, పవన్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News