Share News

ఏపీకి మరో తుఫాన్ ముప్పు.. భారీ వర్షాల హెచ్చరిక

ABN , Publish Date - Oct 31 , 2026 | 01:23 PM

ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్ సముద్ర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని ఏపీఎస్‌డీఎమ్‌ఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది రాబోయే 6 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు.

ఏపీకి మరో తుఫాన్ ముప్పు.. భారీ వర్షాల హెచ్చరిక
Bay of Bengal Depression

అమరావతి, అక్టోబర్ 31: ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్ సముద్ర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని ఏపీఎస్‌డీఎమ్‌ఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది రాబోయే 6 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. ఇది మరింత బలపడి రేపు (ఆదివారం) సాయంత్రానికి తుఫాన్‌గా మారే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించారు. సోమవారం (నవంబర్ 2) సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆంధ్రప్రదేశ్ తీరం సమీపంలోని చేరుకునే అవకాశం ఉందన్నారు.


దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో సెంట్రల్ ఆంధ్రా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురవనున్నట్లు ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా తీరం వెంబడి 45-65 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని.. లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి...

విజయవాడలో ఎన్నికల సామాగ్రి పంపిణీ.. పోలింగ్‌కు సర్వం సిద్ధం

అక్రమాలు నిరూపిస్తే రాజీనామా చేస్తా.. జగన్‌కు మంత్రి సత్యకుమార్ ఛాలెంజ్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 31 , 2026 | 01:34 PM