ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం

ABN, Publish Date - May 04 , 2026 | 08:45 AM

దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు, ఏడు శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు, ఏడు శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదటి దశలోనే ప్రారంభమవడంతో ఎన్నికల ఫలితాలపై ఆసక్తి మరింత పెరిగింది. ఎన్నికల సంఘం సూచనల మేరకు కౌంటింగ్ కేంద్రాల్లో కఠిన భద్రతా ఏర్పాట్ల మధ్య ఓట్ల లెక్కింపు జరుగుతోంది.


ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర సాయుధ బలగాలు, రాష్ట్ర పోలీసులు, లోకల్ పోలీస్ బలగాలు కలిసి భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. ముఖ్యంగా సున్నితమైన నియోజకవర్గాల్లో అదనపు బలగాలను మోహరించారు. సిబ్బంది, ఏజెంట్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే కౌంటింగ్ హాల్‌లోకి అనుమతి ఇచ్చారు. స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి పోస్టల్ బ్యాలెట్ పెట్టెలను సీలు తొలగించి రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో లెక్కింపు గదులకు తరలిస్తున్నారు. ఈ ప్రక్రియలో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ప్రతి దశలోనూ వీడియో రికార్డింగ్, సీసీటీవీ పర్యవేక్షణ కొనసాగుతోంది.

ఈ ఎన్నికల ఫలితాలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ఈ లింక్ ద్వారా ద్వారా వీక్షించండి..


ఈ వార్తలు కూడా చదవండి...

మహానాడును.. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తాం: మంత్రి ఆనం

విజయసాయికి అన్ని పార్టీల్లో డోర్లు క్లోజ్ అయ్యాయి.. బుద్దా వెంకన్న సెటైర్లు

ప్రకాశ్‌రాజ్‌ ఓ పొలిటికల్ జోకర్.. కిరణ్ రాయల్ షాకింగ్ కామెంట్స్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated at - May 04 , 2026 | 08:52 AM