19 నుంచి తెలంగాణలో భారీ వర్షాలు
ABN, Publish Date - Sep 16 , 2026 | 09:27 AM
తెలంగాణలో ఈ నెల 19వ తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. ఈ నెల 19న రాష్ట్రంలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్, సెప్టెంబర్ 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఈ నెల 19వ తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. ఈ నెల 19న రాష్ట్రంలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు వెల్లడించారు. అలాగే 20, 21వ తేదీల్లో కూడా రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కాగా బుధ, గురువారాల్లో తెలంగాణ అంతటా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు.
గడిచిన 24 గంటల్లో హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో అత్యధికంగా 9.2, జనగాం జిల్లా నర్మెట్టలో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డు అయిందని అధికారులు వెల్లడించారు. కాగా ఈనెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా కేవలం 61మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైందని చెప్పుకొచ్చారు. ఈ పదిహేను రోజుల్లో సాధారణ సగటు వర్షపాతం 86మిల్లీమీటర్లు ఉందని.. అయితే ఈ నెలలో ఇప్పటికే 28శాతం లోటు వర్షపాతం నమోదైందని వెల్లడించారు.
గతేడాది సెప్టెంబర్ మొదటి పదిహేను రోజుల్లో ఏకంగా 117 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయిందని అధికారులు వివరించారు. ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు సగటు సాధారణ వర్షపాతం 659 మిల్లీమీటర్లకు గానూ 535మిల్లీమీటర్లే కురిసిందని తెలిపారు. ఈ సీజన్‌లో 19శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత దమనకాండ నడుస్తోంది: కిషన్‌రెడ్డి
వెయ్యి రోజుల పాలనపై సమాధానం చెప్పలేక మాపై దాడులు చేస్తారా?.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజం
అసైన్డ్ భూములపై రేవంత్ ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి: ఎంపీ రఘునందన్ రావు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News
Updated at - Sep 16 , 2026 | 10:42 AM