హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన
ABN, Publish Date - Sep 22 , 2026 | 06:16 PM
హైదరాబాద్‌ను నేడు భారీ వర్షం ముంచెత్తుతోంది. ఆకాశం ఒక్కసారిగా మేఘావృతం కావడంతో.. వాన దంచికొడుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్‌ను నేడు(మంగళవారం) భారీ వర్షం ముంచెత్తుతోంది. ఆకాశం ఒక్కసారిగా మేఘావృతం కావడంతో.. వాన దంచికొడుతోంది. ఈ భారీ వర్షం ధాటికి నగరంలోని పలు ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. ముఖ్యంగా మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, దిల్‍సుఖ్‍నగర్ సహా అనేక ప్రాంతాల్లోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Updated at - Sep 22 , 2026 | 07:25 PM