కర్నూలు జిల్లాలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ ప్రారంభం.. లైవ్ వీడియో
ABN, Publish Date - Jun 24 , 2026 | 12:43 PM
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, ఆర్థిక రంగాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో పర్యటించి, ప్రతిష్ఠాత్మకమైన 'జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు'ను ప్రారంభించనున్నారు.
కర్నూలు జిల్లా, జూన్, 24 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, ఆర్థిక రంగాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు (బుధవారం) కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో పర్యటించి, ప్రతిష్ఠాత్మకమైన 'జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు'ను ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం జిల్లాలో పలు ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లోనూ పాల్గొననున్నారు.
జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని పరుగులు పెట్టించడంలో అత్యంత కీలక పాత్ర పోషించనుందని ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది. ఈ మైనింగ్ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమ ప్రాంతీయ అభివృద్ధి వేగవంతం కావడంతో పాటు, స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఏపీలో పారిశ్రామికవృద్ధికి, మైనింగ్ రంగానికి ఈ ప్రాజెక్ట్ ఒక కొత్త దిక్సూచిగా మారి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు దోహదపడనుంది.
లైవ్ వీడియో కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి..
ఈ వార్తలు కూడా చదవండి...
విశాఖ అగ్నిప్రమాదం.. కార్మికుల మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం
కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు.. జగన్‌పై మంత్రి నిమ్మల ధ్వజం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News
Updated at - Jun 24 , 2026 | 01:03 PM