‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ వాయిస్‌ఓవర్ ఆర్టిస్ట్ మధురవాణికి వైసీపీ బెదిరింపులు

ABN, Publish Date - Apr 07 , 2026 | 04:21 PM

వైసీపీ నేతల బెదిరింపుల వ్యవహారం పరాకాష్టకు చేరింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్‌లో ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ చదివిన వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ మధురవాణికి ఫోన్‌లో బెదిరింపులు వచ్చాయి.

గుంటూరు జిల్లా, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేతల బెదిరింపుల వ్యవహారం పరాకాష్టకు చేరింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్‌లో ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ చదివిన వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ మధురవాణికి (ABN Andhrajyothy Wekend Comment by RK Voice Artist Madhuravani) ఫోన్‌లో బెదిరింపులు వచ్చాయి. పుట్టా ప్రతాప్ పేరుతో పరిచయం చేసుకుని వీకెండ్ కామెంట్ ఎలా చదువుతావు అంటూ బెదిరింపులకు దిగారు. ‘పిన్నెలి రాజ్యాంగం’ అనే ఫేస్ బుక్ పేజీలో కూడా మధురవాణిని బెదిరిస్తూ ఓ పోస్ట్ చేశారు. మహిళ అని చూడకుండా మధురవాణి ఫొటో పెట్టి మరీ... జీతం కోసం దిగజారుతావా అంటూ అసభ్యకర పోస్ట్ పెట్టారు. ఈ బెదిరింపులపై పోలీసులకు మధురవాణి ఫిర్యాదు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఫ్యాక్షన్ బెదిరింపులకు భయపడే వ్యక్తి రాధాకృష్ణ కాదు: మంత్రి లోకేశ్

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడిని ఖండించిన సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated at - Apr 07 , 2026 | 04:44 PM