Share News

వంటలు: మటన్‌ కొవ్వు చారు..

ABN , Publish Date - Nov 15 , 2026 | 12:12 PM

మటన్‌ కొవ్వు చారు తయారీకి కావాల్సిన పదార్థాలు : మటన్‌ కొవ్వు- 500గ్రా., ఉల్లిపాయ - 1, టమాటాలు - 3, చింతపండు - నిమ్మకాయంత, లవంగాలు - 5, కారం - 2.

వంటలు: మటన్‌ కొవ్వు చారు..
vantalu

కావాల్సిన పదార్థాలు : మటన్‌ కొవ్వు- 500గ్రా., ఉల్లిపాయ - 1, టమాటాలు - 3, చింతపండు - నిమ్మకాయంత, లవంగాలు - 5, కారం - 2 టీస్పూన్స్‌, పసుపు - అర టీస్పూన్స్‌, అల్లంవెల్లుల్లి పేస్ట్‌ - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - అర టీస్పూన్‌, జీలకర్రమెంతుల పొడి - అర టీస్పూన్‌, కొత్తిమీర - ఒక కట్ట, ఉప్పు, నూనె - తగినంత


book9.2.jpgతయారుచేసే విధానం : మటన్‌ కొవ్వు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టి పులుసు తీసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ, టమాటాలు కట్‌ చేసుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని నూనె పోసి లవంగాలు, కట్‌ చేసుకున్న ఉల్లిపాయలు వేయించాలి. అవి వేగాక.. పసుపు, అల్లం, వెల్లుల్లిపేస్ట్‌ వేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత టమాటా ముక్కలు, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత మటన్‌ కొవ్వు కూడా వేసి మూత పెట్టి రెండు నిమిషాలు ఆగాలి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకొని జీలకర్ర, మెంతుల పొడి వేసి ఇరవై నిమిషాలు మరిగించుకోవాలి. చివరగా ధనియాల పొడి, కొత్తిమీర వేసి దించేయాలి.


ఈ వార్తలు కూడా చదవండి:

గుండెలోని బాధకు ఓ టెలిఫోన్‌ బూత్‌

ఈ మ్యూజియం... అత్యుత్తమం...

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 15 , 2026 | 12:12 PM