ముగిసిన ముగ్గురు ఎమ్మెల్సీల పదవీ కాలం
ABN , Publish Date - Nov 15 , 2026 | 06:42 AM
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్‌ల పదవీ కాలం శనివారంతో ముగిసింది.
గోరటి వెంకన్న, సారయ్య, దయానంద్‌కు సన్మానం
హైదరాబాద్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్‌ల పదవీ కాలం శనివారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. వారికి శాలువా కప్పి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి, విప్ బల్మూర్ వెంకట్, పలువురు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. శాసన మండలి సభ్యులుగా గోరేటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్ విశేష సేవలు అందించారని కొనియాడారు. ప్రజా సమస్యలను మండలిలో ప్రస్తావించారని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేశారన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాహుల్‌పై కక్ష.. తెలంగాణపై వివక్ష
ఆంధ్రజ్యోతి- ఏబీఎన్ కొత్త కార్యాలయానికి సీఎం రేవంత్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News