రిమ్స్, నాగర్ కర్నూల్ జీజీహెచ్‌లకు కొత్త ఇన్‌చార్జ్‌లు
ABN , Publish Date - Nov 15 , 2026 | 06:46 AM
రాష్ట్రంలోని పలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులకు కొత్త ఇన్‌చార్జ్‌లను నియమిస్తూ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్.చొంగ్తు జీవో జారీ చేశారు.
హైదరాబాద్, నవంబరు 14: రాష్ట్రంలోని పలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులకు కొత్త ఇన్‌చార్జ్‌లను నియమిస్తూ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్.చొంగ్తు జీవో జారీ చేశారు.
సంగారెడ్డి జీఎంసీ ప్లాస్టిక్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ బలి రామ్ చిక్తేను ఆదిలాబాద్ రిమ్స్ ఇన్‌చార్జ్ డైరెక్టర్‌గా నియమించి, అప్పటి వరకు ఆ బాధ్యతల్లో ఉన్న ఆదిలాబాద్ రిమ్స్ ఆర్థోపెడిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్. జైసింగ్‌ను నాగర్ కర్నూల్ జీజీహెచ్ ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్‌గా నియమించారు. డాక్టర్ సుప్రియ నాగర్ కర్నూల్ జీఎంసీ ఓబీజీ ప్రొఫెసర్‌గా కొనసాగుతారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ధరణి అక్రమాలపై సీఐడీ దర్యాప్తు వేగవంతం
వికారాబాద్‌లో మహిళా క్రికెటర్ మృతి!
Read Latest AP News And Telangana News And International News And Telugu News