Share News

లిప్ కిస్ కావాలంటూ విదేశీ యువతికి వేధింపులు.. వైరల్‌గా మారిన వీడియో..

ABN , Publish Date - Nov 15 , 2026 | 11:37 AM

భారత్ అందాలను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో పర్యటిస్తున్న ఓ విదేశీ యువతికి చేదు అనుభవం ఎదురైంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న థాయ్-ఫ్రెంచ్ యూట్యూబర్, ఐఆర్‌ఎల్ స్ట్రీమర్ జస్ట్‌కెత్‌ను ఓ యువకుడు అసభ్యకరమైన కోరికతో ఇబ్బందికి గురిచేశాడు.

లిప్ కిస్ కావాలంటూ విదేశీ యువతికి వేధింపులు.. వైరల్‌గా మారిన వీడియో..
Youtuber JustKeth

ఇంటర్నెట్ డెస్క్: భారత్ అందాలను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో పర్యటిస్తున్న ఓ విదేశీ యువతికి చేదు అనుభవం ఎదురైంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న థాయ్-ఫ్రెంచ్ యూట్యూబర్, ఐఆర్‌ఎల్ స్ట్రీమర్ జస్ట్‌కెత్‌ను ఓ యువకుడు అసభ్యకరమైన కోరికతో ఇబ్బందికి గురిచేశాడు. సాధారణంగా సెల్ఫీ అడుగుతాడని భావించగా.. ఏకంగా పెదవులపై ముద్దు పెట్టాలని అడగడంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఈ ఘటన మొత్తం యువతి కెమెరాలో రికార్డ్ కావడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఉదయ్‌పూర్‌లో రాత్రి వేళ బయట తిరుగుతూ జస్ట్‌కెత్ తన ఫాలోవర్లతో లైవ్ స్ట్రీమింగ్ చేస్తోంది. అదే సమయంలో ఓ యువకుడు ఆమె దగ్గరకు వెళ్లాడు. సాధారణంగా విదేశీయులు కనిపించినప్పుడు సెల్ఫీలు అడగడం సర్వసాధారణం. అతను తన వద్దకు వస్తుండటంతో ఆమె కూడా అదే భావించింది. అయితే, అందుకు భిన్నంగా ఆ యువకుడు తనకు లిప్ కిస్ ఇవ్వాలని కోరాడు. అతడి అనుచితమైన అభ్యర్థనతో జస్ట్‌కెత్ తీవ్ర దిగ్భ్రాంతికి, అసౌకర్యానికి గురైంది. వెంటనే తనకు అలాంటి ఉద్దేశం లేదని స్పష్టంగా నిరాకరించింది. అయినప్పటికీ, అతను పలుమార్లు బతిమిలాడటం వీడియోలో రికార్డైంది. ఈ మొత్తం వ్యవహారం లైవ్‌లో ప్రసారం కావడంతో వేలాది మంది ప్రేక్షకులు ఈ ఘటనను వీక్షించారు.


ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. భారత్‌లో విదేశీయులు పర్యటిస్తున్నప్పుడు ఈ విధంగా ప్రవర్తించడం సిగ్గుచేటని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా విదేశీ మహిళలనే ఉద్దేశంతో వారితో ఎలా ప్రవర్తించినా చెల్లుతుందనే ధోరణిని తీవ్రంగా తప్పుబడుతున్నారు. పర్యాటక ప్రాంతాల్లో మహిళల భద్రతకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో పర్యాటకులకు సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు, ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎలాంటి అధికారిక సమాచారం లేదు.


ఈ వార్తలు కూడా చదవండి

సొరంగమార్గంలో టపాసులు పేల్చిన కుటుంబం.. నెట్టింట వీడియో వైరల్

విడాకుల తరువాత జీవితంలోకి కొత్త నేస్తం.. వరాహంతో స్నేహబంధం!

Updated Date - Nov 15 , 2026 | 11:40 AM