Share News

సొరంగమార్గంలో టపాసులు పేల్చిన కుటుంబం.. నెట్టింట వీడియో వైరల్

ABN , Publish Date - Nov 14 , 2026 | 05:54 PM

సొరంగమార్గంలో ఓ కుటుంబం టపాసులు పేల్చిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

సొరంగమార్గంలో టపాసులు పేల్చిన కుటుంబం.. నెట్టింట వీడియో వైరల్
Bursting firecrackers inside tunnel

ఇంటర్నెట్ డెస్క్: సొరంగమార్గంలో ఓ కుటుంబం టపాసులు పేల్చిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. జనాలు షాకైపోయేలా చేస్తోంది. ఈ వీడియోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయ్‌పూర్‌కు సమీపంలో 58వ జాతీయ రహదారిపై ఉన్న చిర్వా టన్నల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సొరంగమార్గం లోపల కారు నిలిపిన ఓ కుటుంబం ముందూవెనుకా ఆలోచించకుండా అక్కడ టపాసులు పేల్చింది. దీంతో, అక్కడ దట్టమైన పొగకమ్ముకుంది.

ఈ వీడియో నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది ఆ కుటుంబంపై మండిపడ్డారు. కనీస ఇంగిత జ్ఞానం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శిక్షలు, జరిమానాలు పడతాయన్న భయం లేకపోతే ఇలాగే జరుగుతుందని మరికొందరు చెప్పారు. కొందరికి పౌర స్పృహ వీసమెత్తు కూడా ఎందుకుండదని ప్రశ్నించారు.


‘అది వేడుక కాదు. ప్రమాదకరమైన నిర్లక్ష్యం. అది సొరంగ మార్గం. అలాంటి చోట టపాసుల పొగ దట్టంగా కమ్ముకుంటే ఎదురుగా ఉన్నది అస్సలు కనిపించదు. ఘోరమైన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఒక కుటుంబం సంబరం క్షణాల వ్యవధిలో మరో కుటుంబంలో విషాదం నింపుతుంది. ఇలాంటి వాళ్లను వెంటనే అరెస్టు చేయాలి’ అని ఓ వ్యక్తి డిమాండ్ చేశారు. అసలు ఏం జరిగిందనేదానిపై పూర్తిస్పష్టత లేకపోయినప్పటికీ ఈ వీడియో నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది. ఈ వీడియోకు 2 లక్షల పైచిలుకు వ్యూస్ వచ్చాయి.


ఈ వార్తలనూ చదవండి:

నాగ్‌పూర్‌లో పార్కింగ్ గొడవ.. దుకాణదారుడికి బెదిరింపులు

రాష్ట్రీయ భవన్‌లో విద్యార్థులతో మమేకమైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Updated Date - Nov 14 , 2026 | 06:06 PM