Share News

విడాకుల తరువాత జీవితంలోకి కొత్త నేస్తం.. వరాహంతో స్నేహబంధం!

ABN , Publish Date - Nov 15 , 2026 | 11:13 AM

గేల్ థాంప్సన్ అనే అమెరికన్ మహిళ 10 సంవత్సరాల తన వివాహ బంధానికి ముగింపు పలికారు. ఈ బాధ నుంచి కోలుకునేందుకు ఆమె వినూత్న దారిని వెతికారు.

విడాకుల తరువాత జీవితంలోకి కొత్త నేస్తం.. వరాహంతో స్నేహబంధం!

ఇంటర్నెట్ డెస్క్: విడాకుల తరువాత చాలామంది మనోవేదనకు గురవుతారు. దీని నుంచి బయటపడడానికి అనేక మార్గాలను అన్వేషిస్తారు. గతేడాది గేల్ థాంప్సన్ అనే అమెరికన్ మహిళ 10 సంవత్సరాల తన వివాహ బంధానికి ముగింపు పలికారు. ఈ బాధ నుంచి కోలుకునేందుకు ఆమె వినూత్న దారిని వెతికారు. 8 నెలల వరాహాన్ని పెంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ పంది పిల్లతో స్నేహం చేయాలని భావించారు. దానికి ముద్దుగా డైసీ అని పేరూ పెట్టారు. రానురాను వీరి స్నేహబంధం బలపడింది. అయితే ఇందుకు సంబంధించిన కథనాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


డైసీతో తన స్నేహం గురించి థాంప్సన్ పలు విషయాలు పంచుకున్నారు. ‘పంది పిల్లను పెంచుకోవాలని నాకు చిన్ననాటి నుంచీ కోరికగా ఉండేది. అయితే నా మాజీ భర్తకు పందులంటే అసహ్యం. అతడు నిత్యం నా కోరికకు అడ్డుపడేవాడు. పోయిన సంవత్సరమే వైవాహిక జీవితం నుంచి బయటకు రావడంతో.. నాకు అడ్డు చెప్పేవారు ఎవరూ లేరు. అందుకే నా కోరికను నెరవేర్చుకున్నా. డైసీ మా ఇంటికి 2025 నవంబర్‌లో వచ్చింది. అప్పుడది కేవలం 9 పౌండ్ల బరువే ఉండేది. దగ్గరుండి నేను దాని ఆలనా పాలనా చూసుకున్నా. ఇప్పుడు డైసీ బరువు 50 పౌండ్లకు పైనే’ అని ఆమె వివరించారు.

తనకు జంతువులన్నా, పక్షులన్నా ఎంతో ఇష్టమని థాంప్సన్ చెబుతున్నారు. వాటిని ప్రేమగా పెంచుతానని అంటున్నారు. మరోవైపు వచ్చిన కొన్ని రోజులకే డైసీకి స్థానికంగా మంచి ఆదరణ దొరికింది. అది ఒక సెలబ్రిటీలాగా అవతరించింది. అందరి అభిమానం సంపాదించింది. అక్కడి పిల్లలకు దానితో ఆడుకోకపోతే రోజు గడవదు. ఇదంతా చూసి థాంప్సన్ మురిసిపోయేవారు.


ఇవీ చదవండి

ఈ మ్యూజియం... అత్యుత్తమం...

నాగ్‌పూర్‌లో పార్కింగ్ గొడవ.. దుకాణదారుడికి బెదిరింపులు

Updated Date - Nov 15 , 2026 | 11:24 AM