Share News

ఏపీ ఆక్టోపస్‌ డబుల్‌ ధమాకా

ABN , Publish Date - Nov 15 , 2026 | 04:59 AM

ఆంధ్రప్రదేశ్‌ ఆక్టోపస్‌ పోలీసులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ ఆధ్వర్యంలో హరియాణలోని మనేసర్‌లో నిర్వహించిన రెండు ప్రతిష్టాత్మక పోటీల్లో విజేతలుగా నిలిచి...

ఏపీ ఆక్టోపస్‌ డబుల్‌ ధమాకా

  • జాతీయ స్థాయిలో రెండు పోటీల్లో ప్రథమ స్థానం

  • ఎన్‌ఎస్‌జీ ఆధ్వర్యంలో హరియాణాలో నిర్వహణ

అమరావతి, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ఆక్టోపస్‌ పోలీసులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ ఆధ్వర్యంలో హరియాణలోని మనేసర్‌లో నిర్వహించిన రెండు ప్రతిష్టాత్మక పోటీల్లో విజేతలుగా నిలిచి చరిత్ర సృష్టించారు. ఉగ్రవాద నిరోధక కమాండో పోటీ (అగ్నిపరీక్ష)తో పాటు బాంబులను గుర్తించి నిర్వీర్యం చేసే ప్రత్యేక పోటీ (విస్ఫోట్‌ కవచ్‌)లోనూ ఏపీ ఆక్టోపస్‌ ప్రథమ స్థానంలో నిలిచింది. ఒకేసారి రెండు వేర్వేరు విభాగాల్లో రాష్ట్ర పోలీసులు జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం ఇదే మొదటిసారి.

ఈ నెల 2 నుంచి 14 వరకూ దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసు బలగాలతో నిర్వహించిన ఈ పోటీల్లో 26 అత్యుత్తమ టీమ్‌లు పాల్గొన్నాయి. కాగా, రెండు పోటీల్లో ఏపీ ఆక్టోపస్‌ బృందాలు ప్రథమ స్థానం సాధించడంపై డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా హర్షం వ్యక్తం చేశారు. ఆక్టోపస్‌ ఐజీ శ్రీకాంత్‌తో పాటు బృంద సభ్యులను ఏపీ పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో శనివారం ఆయన అభినందించారు.

ఈ వార్తలనూ చదవండి:

జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు

కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేద్దాం

Updated Date - Nov 15 , 2026 | 04:59 AM