Share News

చిన్నారులకు డిప్తీరియా, ధనుర్వాతం టీకాలు

ABN , Publish Date - Nov 15 , 2026 | 05:05 AM

డిప్తీరియా, ధనుర్వాతం వ్యాధుల నుంచి పిల్లలకు అదనపు రక్షణ కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక టీకా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య శాఖ కమిషనర్‌ చక్రధర్‌బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

చిన్నారులకు డిప్తీరియా, ధనుర్వాతం టీకాలు

  • డిసెంబరు 3 నుంచి 5 వరకూ ప్రత్యేక టీకా కార్యక్రమం

అమరావతి, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): డిప్తీరియా, ధనుర్వాతం వ్యాధుల నుంచి పిల్లలకు అదనపు రక్షణ కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక టీకా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య శాఖ కమిషనర్‌ చక్రధర్‌బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబరు 3 నుంచి 5 వరకూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ఇంటర్‌ కాలేజీల్లో 10-16 ఏళ్ల పిల్లలకు టీడీ టీకాలు వేస్తామన్నారు. డిప్తీరియా, ధనుర్వాతం తీవ్ర అనారోగ్యానికి, ప్రాణాపాయానికి దారితీసే అంటువ్యాధులు కావడంలో యుక్త వయసులోనూ రక్షణ కల్పించడం అవసరమన్నారు.

ప్రతి ఏఎన్‌ఎం తన పరిధిలో టీకా ఇవ్వాల్సిన పిల్లల వివరాలను సేకరించాలని ఆదేశించారు. టీకా కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. టీకా ఇచ్చాక.. తీవ్రమైన అలర్జీ వంటి అత్యవసర పరిస్థితులు ఎదురైతే చికిత్స అందించేందుకు అన్‌ఫైలాక్సిస్‌ కిట్‌ తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో ప్రత్యేక టీకా కార్యక్రమం నిర్వహించి, అర్హులైన పిల్లలందరికీ టీకాలు ఇవ్వాలని ఆదేశించారు.

ఈ వార్తలనూ చదవండి:

జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు

కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేద్దాం

Updated Date - Nov 15 , 2026 | 05:05 AM