Share News

వంటలు: ముట్ట రోస్ట్‌.. తయారు చేసుకోండిలా..

ABN , Publish Date - Nov 15 , 2026 | 11:56 AM

ముట్ట రోస్ట్‌.. తయారీకి కావాల్సిన పదార్థాలు : కోడిగుడ్లు - 4, ఉల్లిగడ్డలు - 150గ్రా., టమాటాలు - 200 గ్రా., పచ్చిమిర్చి - 2, అల్లంవెల్లుల్లి పేస్ట్‌ - రెండు టేబుల్‌స్పూన్స్‌.

వంటలు: ముట్ట రోస్ట్‌.. తయారు చేసుకోండిలా..
vantalu

కావాల్సిన పదార్థాలు : కోడిగుడ్లు - 4, ఉల్లిగడ్డలు - 150గ్రా., టమాటాలు - 200 గ్రా., పచ్చిమిర్చి - 2, అల్లంవెల్లుల్లి పేస్ట్‌ - రెండు టేబుల్‌స్పూన్స్‌, కారం - రెండు టీస్పూన్స్‌, గరం మసాలా - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, మిరియాల పొడి - ఒకటిన్నర టీస్పూన్‌, జీలకర్ర పొడి - ఒక టీస్పూన్‌, కరివేపాకు - రెండు రెమ్మలు, కొబ్బరినూనె, ఉప్పు - తగినంత.


book8.2.jpgతయారుచేసే విధానం: కోడిగుడ్లను ఉడకబెట్టి గాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలను నిలువుగా, సన్నగా కట్‌ చేయాలి. అలాగే టమాటాలు, పచ్చిమిర్చిలను చిన్నగా కట్‌ చేయాలి. ఇప్పుడు కడాయిలో కొద్దిగా నూనె పోసి గాట్లు పెట్టిన గుడ్లను లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఆ గుడ్లను పక్కన పెట్టి అదే నూనెలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బ్రౌన్‌ కలర్‌ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇందులో టమాటా ముక్కలు వేసి మూత పెట్టాలి. టమాటాలు ఉడికిన తర్వాత అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ వేసి మరో మూడు నిమిషాలు కలపాలి. ఆ తర్వాత ఇందులో కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి, గరం మసాలా, ధనియాల పొడి, కరివేపాకు, ఉప్పు వేయాలి. ఈ మసాలాలు వేగాక పావు కప్పు నీళ్లు పోసి వేగించిన కోడిగుడ్లను వేయాలి. ఐదు నిమిషాల తర్వాత దించేస్తే సరిపోతుంది.


ఈ వార్తలు కూడా చదవండి:

గుండెలోని బాధకు ఓ టెలిఫోన్‌ బూత్‌

ఈ మ్యూజియం... అత్యుత్తమం...

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 15 , 2026 | 12:07 PM