Share News

మసాలా పాప్డీ.. తయారీకి కావాల్సినవి ఇవే..

ABN , Publish Date - May 17 , 2026 | 01:01 PM

మసాలా పాప్డీ.. తయారీకి కావాల్సినవి.. గోధుమ పిండి - రెండు కప్పులు, రవ్వ - అర కప్పు, పసుపు - పావు స్పూను, కారం - అర స్పూను

మసాలా పాప్డీ.. తయారీకి కావాల్సినవి ఇవే..
Masala Papdi

కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి - రెండు కప్పులు, రవ్వ - అర కప్పు, పసుపు - పావు స్పూను, కారం - అర స్పూను, ఆమ్‌చూర్‌ - స్పూను, జీలకర్ర - స్పూను, సోంఫు - స్పూను, ఇంగువ - అర స్పూను, ఉప్పు, నూనె- తగినంత నెయ్యి - రెండు స్పూన్లు.


book9.2.jpgతయారుచేసే విధానం: ఓ పెద్ద గిన్నెలోకి అన్ని పదార్థాలను తీసుకోవాలి. రెండు స్పూన్ల వేడి నూనెను వేసి కలపాలి. తగినంత వెచ్చని నీళ్లనీ కలపి ముద్దలా చేసుకోవాలి. అయిదు నిమిషాల తరవాత ఈ ముద్దని రెండుగా చేసుకోవాలి. ఒక్కో దాన్ని పిండిలో అద్ది గుండ్రటి రొట్టెలా వత్తుకోవాలి. ఈ రొట్టెని చిన్న పూరీల్లా కట్‌చేసుకోవాలి. బాణలిలో నూనె వేసి కాగాక వీటిని దోరగా వేయించి తీస్తే మసాలా పాప్డీ తయారు.


ఈ వార్తలు కూడా చదవండి:

సరదాగా సరిహద్దుల్లోకి...

శ్రీవారి ‘మెడికల్‌ దర్శనం’ కోటాను విస్తరించండి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 17 , 2026 | 01:05 PM