Share News

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఒకే టికెట్‌పై..

ABN , Publish Date - May 17 , 2026 | 12:20 PM

వేసవి సెలవుల నేపథ్యంలో శ్రీనివాసుడు కొలువుదీరిన తిరుమల పుణ్యక్షేత్రం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. శ్రీవారికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో.. స్వామి వారి దర్శనానికి చాలా సమయం పడుతోంది.

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఒకే టికెట్‌పై..
Tirumala Temple

తిరుమల, మే 17: వేసవి సెలవుల నేపథ్యంలో శ్రీనివాసుడు కొలువుదీరిన తిరుమల పుణ్యక్షేత్రం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. శ్రీవారికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో.. స్వామి వారి దర్శనానికి చాలా సమయం పడుతోంది. అలాంటి సమయంలో శ్రీవారి భక్తులకు టీటీడీ పండగలాంటి వార్త చెప్పింది. శ్రీవేంకటేశ్వరస్వామి మూలమూర్తిని ఒకే టికెట్‌పై మూడు రోజులు దర్శించుకునే అవకాశాన్ని భక్తులకు టీటీడీ కల్పిస్తుంది. శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది ఆగస్టు 23 నుంచి 25వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు.


ఆగస్టు 22వ తేదీన అత్యంత వైభవంగా నిర్వహించే ఈ ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు. ఈ పవిత్రోత్సవాల్లో పాల్గొనే భక్తులకు మే 21వ తేదీన టీటీడీ ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లో టికెట్లు జారీ చేస్తుంది. ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసే ఈ టికెట్‌ను ఇద్దరికీ కలిపి రూ. 5 వేలు చెల్లించి కొనుగోలు చేయవచ్చు. ఈ టికెట్లు పొందిన భక్తులు పవిత్రోత్సవాలు జరిగే మూడు రోజులు స్నపన తిరుమంజనంతోపాటు చివరి రోజు పూర్ణాహుతిలో పాల్గొనవచ్చు.

ఈ పవిత్రోత్సవాల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో ఉదయం 7 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్- 1 వద్దకు చేరుకుని ఏదైనా ఫొటో గుర్తింపు కార్డు టీటీడీ సిబ్బందికి చూపించాల్సి ఉంటుంది. ఆలయంలో ఏడాది పొడవునా అర్చనలు, ఉత్సవాలు జరుగుతాయి. ఆ సమయంలో భక్తులు, సిబ్బంది వల్ల తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా ఆగమశాస్త్రం ప్రకారం ఈ పవిత్రోత్సవాలను టీటీడీ నిర్వహిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

అధిక జ్యేష్ఠ మాసం.. ఈ పనులు చేయకూడదు..

కర్తరి ప్రారంభం.. ఈ సమయంలో ఏం చేయాలి.. ఏం చేయకూడదు?
For More Devotional News And Telugu News

Updated Date - May 17 , 2026 | 12:50 PM