Share News

అధిక జ్యేష్ఠ మాసం.. ఈ పనులు చేయకూడదు..

ABN , Publish Date - May 17 , 2026 | 10:17 AM

తెలుగు పంచాంగం ప్రకారం నేటి నుంచి (మే 17వ తేదీ) అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరంలో 12 నెలలు ఉంటాయన్న సంగతి అందరికి తెలసిందే. కానీ అధిక మాసం కారణంగా ఈ ఏడాది 13 నెలలు ఉంటాయి.

అధిక జ్యేష్ఠ మాసం.. ఈ పనులు చేయకూడదు..

తెలుగు పంచాంగం ప్రకారం.. నేటి నుంచి (మే 17వ తేదీ) అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరంలో 12 నెలలు ఉంటాయన్న సంగతి అందరికి తెలసిందే. కానీ అధిక మాసం కారణంగా ఈ ఏడాది 13 నెలలు ఉంటాయి. అధిక మాసంలో శుభకార్యాలు చేయరు. అయినప్పటికీ కొన్ని వైదిక పరమైన కార్యక్రమాలు జరుపుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు. ఈ సమయంలో ప్రతిరోజూ స్నానం చేసిన అనంతరం మీ శక్తి, సామర్థ్యాల మేరకు దానధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని చెబుతున్నారు. సూర్య, చంద్ర గమనాల సమన్వయం కోసం సుమారు మూడేళ్లకు ఒకసారి ఒక మాసం అదనంగా చేరుతుంది. దీనిని అధిక మాసం లేదా పురుషోత్తమ మాసం అని కూడా అంటారు.


అధిక జ్యేష్ఠ మాసం ఎప్పుడు?

ఈ ఏడాది మే 17వ తేదీ అదివారం నుంచి జూన్ 15వ తేదీ సోమవారం వరకు అధిక జ్యేష్ఠ మాసం ఉంటుంది.


ఈ మాసంలో చేయాల్సిన పనులు..

శ్రీమహావిష్ణువుని పూజించాలి. విష్ణు సహస్ర నామం, గీతా పారాయణం చేయాలి. ఉపవాస దీక్షలు చేస్తూ పూజలు నిర్వహించాలి. శక్తి, సామర్థ్యాల మేరకు ధాన్యం, పండ్లు, దుస్తులు, బెల్లం, నెయ్యిలను దానం చేయాలి. పితృకార్యాలు చేయవచ్చు. ఈ మాసాన్ని ఆధ్యాత్మిక సాధనకు వినియోగించడం శ్రేయస్కరమని అంటారు.


ఈ పనులు చేయకూడదు..

  • ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలూ నిర్వహించకూడదు.

  • వివాహ కార్యక్రమాలు, విహారయాత్రలు, నూతన గృహ ప్రవేశాలు చేయకూడదు.

  • కొత్త వాహనం, కొత్త ఆభరణాలు, కొత్త దుస్తులు వంటివి కొనుగోలు చేయకూడదు.

  • భూమి, ఆస్తి కొనుగోలు చేయడం వంటివి చేయకూడదు.

  • ఉపనయనాలు, నామకరణాలు, శంకుస్థాపనలు, అన్న ప్రాసన, అక్షరాభ్యాసం చేయకూడదు.


ఈ మాసంలో కొన్ని పుణ్య తిథులు..

  • మే 22వ తేదీ.. శుక్రవారం

  • తిరుపతిలోని శ్రీగోవిందరాజు స్వామి వారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.

  • మే 23వ తేదీ.. శనివారం

  • ధ్వజారోహణంతో శ్రీగోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.

  • మే 25వ తేదీ.. సోమవారం

  • శుద్ధ నవమి/దశమి.

  • రోహిణి కార్తె ప్రారంభం.

  • మే 27వ తేదీ.. బుధవారం

  • శుద్ధ ఏకాదశి.. పద్మిని ఏకాదశి

  • మూడేళ్లకు ఒకసారి వస్తుంది. తిరుపతిలో గరుడోత్సవం నిర్వహిస్తారు.


  • మే 28వ తేదీ.. గురువారం

  • శుద్ధ ద్వాదశి/ త్రయోదశి

  • నారాయణవనంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహోత్సవాలు ప్రారంభం.

  • మే 29వ తేదీ.. శుక్రవారం

  • కర్తరి త్యాగం.

  • మే 31వ తేదీ.. ఆదివారం

  • పౌర్ణమి.. శ్రీగోవిందరాజ స్వామి వారి చక్రస్నానంతోపాటు ధ్వజావరోహణంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

  • జూన్ 2వ తేదీ.. మంగళవారం

  • బహుళ విదియ..యమునా నది పుష్కరాలు ప్రారంభం.


  • జూన్ 4వ తేదీ.. గురువారం

  • బహుళ చవితి..సంకష్టహర చవితి

  • జూన్ 5వ తేదీ.. శుక్రవారం

  • బహుళ పంచమి.. శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు సమాప్తి.

  • జూన్ 8వ తేదీ.. సోమవారం

  • బహుళ అష్టమి.. మృగశిర కార్తె ప్రారంభం.

  • జూన్ 11వ తేదీ.. గురువారం

  • సర్వ ఏకాదశి.


  • జూన్ 13వ తేదీ.. శనివారం

  • శని త్రయోదశి, మాస శివరాత్రి.

  • జూన్ 15వ తేదీ.. సోమవారం

  • అమావాస్య.. ఈ రోజుతో అధిక జ్యేష్ఠ మాసం ముగుస్తుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుమల కొండపై జోరుగా కడియాల వ్యాపారం

వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే..

For More Devotional News And Telugu News

Updated Date - May 17 , 2026 | 10:44 AM