Share News

వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - May 17 , 2026 | 07:52 AM

ఈ వారం రాశిఫలాలు.. 17 - 23 మే 2026. పి.ప్రసూనారామన్‌.. ఆ రాశివారు ఆర్థికలావాదేవీల్లో జాగ్రత్త వహించండి.

వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే..
Weekly Horoscope

ఈ వారం రాశిఫలాలు.. 17 - 23 మే 2026. పి.ప్రసూనారామన్‌..

మేషం

అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

mesham.jpgఆర్థికలావాదేవీల్లో జాగ్రత్త వహించండి. తొందరపాటు నిర్ణయం తగదు. రావలసిన ధనం ఆలస్యంగా అందుతుంది. అవసరాలు నెరవేరవు. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలతో సతమతమవు తారు. సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్సాహపరు స్తాయి. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఒక ఆహ్వానం సందిగ్థానికి గురిచేస్తుంది.


వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు

vrushabham.jpgఆదాయం నిరాశాజనకం. ఊహించని ఖర్చు ఎదురవుతుంది. పనులు ఒక పట్టాన సాగవు. అప్రమత్తంగా ఉండా ల్సిన సమయం. ఫోన్‌ సందేశాలు పట్టించుకో వద్దు. ప్రతీ విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు ప్రాధాన్యమి వ్వండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు.


మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు

mithunam.jpgదీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. మానసికంగా కుదుటపడతారు. స్థిరాస్తి ధనం అందుతుంది. చుట్టుపక్కల వారిని గమనించండి. కష్టమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. పలుకుబడి ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా తెలియజేయండి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. పుణ్యకార్యంలో పాల్గొంటారు. ప్రయాణం కలిసివస్తుంది.


కర్కాటకం

పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

karkatakam.jpgనిర్విరామంగా శ్రమిస్తారు. మీ కష్టం వృథాకాదు. అవకాశాలను చేజిక్కించు కుంటారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పిల్లల పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. పాతమిత్రులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. అనవసర విషయాల జోలికి పోవద్దు. ఆహ్వానం అందుకుంటారు. ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి.


సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

simham.jpgకష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ప్రముఖులకు చేరువవుతారు. సభ్యత్వం స్వీకరిస్తారు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. తొం దరపడి హామీలివ్వవద్దు. విలాసాలకు ఖర్చు చేస్తారు. గృహనిర్మాణం పూర్తి కావస్తుంది. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆప్తులతో తరచూ సంభాషి స్తారు. ఫోన్‌ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు.


కన్య

ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు

kanya.jpgఆశావహదృక్పథంతో మెల గండి. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. నచ్చిన వ్యక్తులతో కాలక్షేపంచేయండి. వ్యాప కాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. ఆదా యం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు తగ్గించు కుంటారు. పనులు త్వరితగతిన సాగుతాయి. ఒక ఆహ్వానం ఆలోచింప చేస్తుంది. గృహో పకరణాలు మరమ్మతుకు గురవుతాయి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది.


తుల

చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు

tula.jpgసర్వదా అనుకూలదాయకం. తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. వ్యూహా త్మకంగా అడుగు ముందుకేస్తారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. మీ చొరవతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఉల్లా సంగా గడుపుతారు. నగదు, వస్తువులు జాగ్రత్త. శుభకార్యానికి హాజరవుతారు.


వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ

vruchikam.jpgలావాదేవీలు ముగుస్తాయి. రావలసిన ధనం అందుతుంది. కొన్ని ఇబ్బం దులు తొలగుతాయి. మానసికంగా కుదుట పడతారు. పనులు త్వరితగతిన సాగుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఇంటి విషయాలపై దృష్టిపెడతారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఆధ్యాత్మికత పెంపొందుతుంది.


ధనుస్సు

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

dhanussu.jpgవ్యవహారజయం, వస్త్రప్రాప్తి, వాహనసౌఖ్యం ఉన్నాయి. మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పనులు అనుకున్న విధంగా సాగవు. మనోధైర్యంతో మెలగండి. స్థిరాస్తి ధనం అందుతుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి. పిల్లల విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. తొందరపడి ఒప్పందాలు కుదుర్చుకోవద్దు.


మకరం

ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు

makaram.jpgకొత్తయత్నాలకు శ్రీకారం చుడ తారు. ఆప్తుల ప్రోత్సాహం ఉంటుంది. అప్ర యత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ఉల్లా సంగా గడుపుతారు. ఆదాయం బాగుంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీ దులు, పత్రాలు జాగ్రత్త. ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. అందరితోనూ మితంగా సంభాషిం చండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు.


కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

kumbham.jpgతలపెట్టిన కార్యం విజయ వంతమవుతుంది. ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. దూరపు బంధుత్వాలు బల పడతాయి. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఒక వ్యవహారం మీ సమక్షంలో సాగుతుంది. ఉభయులకూ చక్కని పరిష్కారం చూపు తారు. చేపట్టిన పనుల్లో ఒత్తిడికి గురికావద్దు. మీ ఉన్నతిని చాటుకోవటానికి వ్యయం చేస్తారు. పిల్లల మొండితనం చికాకుపరు స్తుంది. అప్రియమైన వార్త వింటారు.


మీనం

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

meemam.jpgఅన్ని విధాలా అనుకూలం. సర్వత్రా మీదే పైచేయి. పరిచయస్తులు మీ ప్రాపకం కోసం పాకులాడుతారు. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్ద్దు. ఆపన్నులకు సాయం అం దిస్తారు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవు తాయి. ఆహ్వానం అందుకుంటారు. వివాహ యత్నం తీవ్రంగా సాగిస్తారు. కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు.


ఈ వార్తలు కూడా చదవండి:

నేడు ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదల

శ్రీవారి ‘మెడికల్‌ దర్శనం’ కోటాను విస్తరించండి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 17 , 2026 | 07:52 AM