Share News

నేడు ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదల

ABN , Publish Date - May 17 , 2026 | 05:38 AM

ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి గాను నిర్వహించిన ఎప్‌సెట్‌-2026 ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ...

 నేడు ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి గాను నిర్వహించిన ఎప్‌సెట్‌-2026 ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ జేఎన్‌టీయూ కాలేజీలో ప్రభుత్వ సలహాదారు కంచర్ల కేశవరావు ఈ ఫలితాలను వెల్లడిస్తారని సెట్‌ కన్వీనర్‌ కె.విజయ కుమార్‌ రెడ్డి తెలిపారు. 11:15గంటల నుంచి http://eapcet.tgche.ac.inలో విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ నంబర్లను ఎంటర్‌ చే సి, ఫలితాలు చూసుకొవొచ్చని సూచించారు. కాగా, ఈ ఏడాది ఎప్‌సెట్‌ చివరి పరీక్ష ముగిసిన వారం రోజుల్లోపే ఫలితాలను ప్రకటిస్తుండడం విశేషం.

Updated Date - May 17 , 2026 | 06:03 AM