Share News

అంతకంతకూ తగ్గుతున్న గోల్డ్, సిల్వర్ రేట్స్

ABN , Publish Date - May 17 , 2026 | 07:13 AM

దేశంలో బంగారం, వెండి ధరలు గత కొంత కాలంగా తగ్గుతూనే ఉన్నాయి. ప్రస్తుతం వివిధ నగరాల్లోని రేట్స్ ఇవీ

అంతకంతకూ తగ్గుతున్న గోల్డ్, సిల్వర్ రేట్స్
Gold, Silver Rate on May 17

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో బంగారం, వెండి ధరలు అంతకంతకూ పతనం అవుతున్నాయి. రూపాయి మారకం విలువ పడిపోవడం, అంతర్జాతీయ అనిశ్చితులు, యూఎస్ డెట్ సెక్యూరిటీలపై రాబడులు పెరగడంతో బంగారం, వెండి ధరలు గత మూడు రోజులుగా తగ్గుతూనే ఉన్నాయి. రాబోయే రోజుల్లో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (మే 17) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,56,930గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,850ల వద్ద కొనసాగుతోంది. నగరంలో కిలో వెండి రూ.2.90 లక్షలకు చేరుకుంది.


ఇక చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,60,910ల వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,47,500గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,56,930గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,43,850గా ఉంది. దేశరాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,57,080 పలుకుతోంది. 22 క్యారెట్ల ఆర్నమెంటల్ పసిడి ధర రూ.1,44,000గా ఉంది. దేశంలోని వివిధ నగరాల్లో కిలో వెండి ధర రూ.2.90-2.80 లక్షల మధ్య కదలాడుతోంది.


ఈ వార్తలనూ చదవండి:

ప్రపంచంలో అతిపెద్ద ఏఐ టెక్‌ కంపెనీగా టీసీఎస్‌

బంగారంలో పెట్టుబడులకు గోల్డ్‌ ఈటీఎఫ్‌, ఈజీఆర్‌లు

Updated Date - May 17 , 2026 | 07:29 AM