Share News

క్వాంటమ్ టెక్నాలజీకి అమరావతి కేంద్రం: నారా లోకేశ్

ABN , Publish Date - May 17 , 2026 | 12:43 PM

క్వాంటమ్ టెక్నాలజీకి అమరావతి కేంద్రమని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. యువ భారతీయులు అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతామని అంటున్నారని పేర్కొన్నారు.

క్వాంటమ్ టెక్నాలజీకి అమరావతి కేంద్రం: నారా లోకేశ్
AP Minister Nara Lokesh

అమరావతి, మే 17 (ఆంధ్రజ్యోతి): క్వాంటమ్ టెక్నాలజీకి అమరావతి కేంద్రమని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) వ్యాఖ్యానించారు. యువ భారతీయులు అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతామని అంటున్నారని పేర్కొన్నారు. గుంటూరుకు చెందిన రిక్షాడ్రైవర్ కుమార్తె పల్లవి కాయాల క్వాంటమ్ రంగంలో ప్రతిభ కనబరుస్తోందని తెలిపారు. టెన్త్‌లో 600/600 మార్కులు సాధించిన పల్లవి ఇప్పుడు IIIT శిక్షణ పొందిన ఇంజినీర్ అని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా లోకేశ్ పోస్టు పెట్టారు. ముంబై నుంచి అమరావతికి వచ్చిన గోపాల్ జోషి క్వాంటమ్ ఆపరేషన్స్‌లో సేవలు అందిస్తున్నారని తెలిపారు.


ప్రముఖ భారతీయ విద్యాసంస్థల్లో పరిశోధనలు చేసిన నాగలక్ష్మయ్య... అధునాతన RF సిస్టమ్స్ అభివృద్ధి చేస్తున్నారని మంత్రి లోకేశ్ వివరించారు. నగరం పూర్తికాకముందే అమరావతికి శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఆకర్షితులు అవుతున్నారని వెల్లడించారు. అమరావతిపై యువతలో పెరుగుతున్న నమ్మకం, ఆశయాలకు ఇది నిదర్శనమని ఉద్ఘాటించారు. భారత్‌లో ఎదుగుతున్న డీప్ టెక్ హబ్‌గా అమరావతిని ఎకనామిక్ టైమ్స్ గుర్తించిందని తెలిపారు. విద్యార్థులు, శాస్త్రవేత్తలు, స్టార్టప్‌లకు అమరావతి కొత్త అవకాశాల వేదిక అని వ్యాఖ్యానించారు. భారత భవిష్యత్తు టెక్నాలజీల రూపకల్పనలో ఏపీ యువత కీలక పాత్ర పోషించనుందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏఎంసీఏ ప్రాజెక్టు రాయలసీమ అభివృద్ధిలో కీలక మైలురాయి: సీఎం చంద్రబాబు

ఫ్యాక్షన్ రాజకీయాలు తట్టుకుని ఇక్కడివరకొచ్చా.. జగన్ అండ్‌కోకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్

విజయవాడ జీజీహెచ్ ఘటనపై మంత్రి సత్యకుమార్ సీరియస్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 17 , 2026 | 12:55 PM