Share News

ఎబోలా కలకలం.. గ్లోబల్ ఎమర్జెన్సీని ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

ABN , Publish Date - May 17 , 2026 | 11:54 AM

ఆఫికాలోని డీఆర్ కాంగో దేశంలో ఎబోలా కేసులు పెరిగిన నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీని ప్రకటించింది. కాంగో పొరుగున ఉన్న ఉగాండాకు కూడా వైరస్ వ్యాపించి ఉండవచ్చని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ తెలిపారు.

ఎబోలా కలకలం.. గ్లోబల్ ఎమర్జెన్సీని ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
Ebola Virus Outbreak in Africa

ఇంటర్నెట్ డెస్క్: ఆఫ్రికా దేశం డీఆర్ కాంగోలో ఎబోలా వైరస్ కలకలం రేగింది. అక్కడ సుమారు 246 మంది ఎబోలా వైరస్ బారినపడ్డట్టు తెలుస్తోంది. 80 మరణాలు సంభవించాయి. డీఆర్ కాంగోలోని ఇటూరీ ప్రావిన్స్ రాజధానితో పాటు సమీపాన మరో రెండు టౌన్‌లలో ఈ కేసులు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రజారోగ్య ఎమర్జెన్సీని ప్రకటించింది. ఇవి అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే పరిణామాలని పేర్కొంది.


ఈ పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధానమ్ సూచించారు. డీఆర్ కాంగోలో ఇప్పటివరకూ ఎనిమిది మంది ఎబోలా వ్యాధి బారినపడ్డట్టు లేబొరేటరీ పరీక్షల్లో పూర్తిస్థాయిలో నిర్ధారణ అయిందని అన్నారు. వ్యాధి వ్యాప్తికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు. డీఆర్ కాంగోతో పాటు పొరుగున ఉన్న ఉగాండాకు కూడా వ్యాధి వ్యాపించి ఉండవచ్చని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ హెచ్చరించారు. వ్యాధి మరింతగా వ్యాపించకుండా రెండు దేశాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు ఎమర్జెన్సీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. పొరుగున ఉన్న దేశాల వారు కాంగో, ఉగాండాలకు పర్యటనలను వాయిదా వేసుకోవాలని సూచించారు.


ఈ వార్తలనూ చదవండి:

హోర్ముజ్‌లో నౌక సీజ్.. చైనాకు ఇరాన్ వార్నింగ్!

ఇది తుపానుకు ముందు ప్రశాంతత.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

Updated Date - May 17 , 2026 | 12:39 PM