కథియవాడీ సేవ్ టమాటర్.. తయారు చేసుకోండిలా..
ABN , Publish Date - May 17 , 2026 | 12:29 PM
కథియవాడీ సేవ్ టమాటర్.. తయారు చేసుకోవడానికి కావాల్సినవి.. టమాటాలు - నాలుగు, మందపాటి నైలాన్ సేవ్- కప్పు, పోపు గింజలు - స్పూను,
కావలసిన పదార్థాలు: టమాటాలు - నాలుగు, మందపాటి నైలాన్ సేవ్- కప్పు, పోపు గింజలు - స్పూను, ఇంగువ - కాస్త, పచ్చి మిర్చి ముక్కలు - స్పూను, వెల్లుల్లి పేస్టు - స్పూను, కారం - స్పూను, పసుపు - అర స్పూను, ధనియాల పొడి - స్పూను, ఉప్పు - కాస్త, చక్కెర- స్పూను, నీళ్లు, నూనె- తగినంత, కొత్తిమీర తరుగు - స్పూను.
తయారుచేసే విధానం: ఓ బాణలిలో కాస్త నూనె వేసి, పోపు గింజలు చిటపటలాడించాలి. పచ్చి మిర్చి, వెల్లుల్లి పేస్టూ కలపాలి. ఆ తరవాత టమాటా ముక్కలూ వేయాలి. కాస్త మగ్గాక పసుపు, ధనియాల పొడి, ఉప్పు, కారం, చక్కెర వేసి, కొంచెం నీళ్లను కలిపి మూత పెట్టాలి. అయిదు నిమిషాల తరువాత స్టవ్ కట్టేస్తే సరి. వడ్డించేప్పుడు సేవ్‌ను కలిపితే మెత్తగా కాకుండా గట్టిగా ఉంటాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
శ్రీవారి ‘మెడికల్ దర్శనం’ కోటాను విస్తరించండి
Read Latest AP News And Telangana News And International News And Telugu News