Share News

నల్లగొండలో ఘోరం.. కళ్లలో కారం చల్లి తల్లీకూతురి దారుణ హత్య

ABN , Publish Date - May 17 , 2026 | 11:41 AM

నల్లగొండ జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. అనుముల మండలం ఇబ్రహీంపేట గ్రామంలో గుర్తుతెలియని దుండగులు నడిరోడ్డుపై ఘోరానికి ఒడిగట్టారు. వివరాల్లోకి వెళితే..

నల్లగొండలో ఘోరం.. కళ్లలో కారం చల్లి తల్లీకూతురి దారుణ హత్య
Nalgonda Mother Daughter Incident

ఇబ్రహీంపేట, మే 17: నల్లగొండ జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. అనుముల మండలం ఇబ్రహీంపేట గ్రామంలో గుర్తుతెలియని దుండగులు నడిరోడ్డుపై ఘోరానికి ఒడిగట్టారు. తల్లీకూతురిని అత్యంత కిరాతకంగా హతమార్చడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతులను రుద్రాక్ష సుమలత, ఆమె కుమార్తె లావణ్యగా పోలీసులు గుర్తించారు. పక్కా పథకం ప్రకారం దాడి చేసిన హంతకులు.. కళ్లలో కారం చల్లి హత్య చేసినట్లు తెలిసింది.


ఈ జంట హత్యల వెనుక భూతగాదాలే ప్రధాన కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కొంతకాలంగా మృతుల కుటుంబానికి, మరికొందరికి మధ్య భూవివాదాలు నడుస్తున్నట్లు సమాచారం. పాత కక్షలను మనసులో పెట్టుకుని, ఒంటరిగా దొరికిన సమయంలో దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకునన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

నేడు ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదల

శ్రీవారి ‘మెడికల్‌ దర్శనం’ కోటాను విస్తరించండి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 17 , 2026 | 11:52 AM