Share News

పేదల పొదుపు సొమ్ము స్వాహా

ABN , Publish Date - Nov 24 , 2026 | 11:27 AM

గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ 33వ డివిజన్‌ (శాంతినగర్‌) తాజా మాజీ కార్పొరేటర్‌ ముష్కమల్ల అరుణ భర్త ముష్కమల్ల సుధాకర్‌ను పరపతి సంఘం నిధుల దుర్వినియోగం కేసులో మిల్స్‌కాలనీ పోలీసులు అరెస్టు చేశారు.

పేదల పొదుపు సొమ్ము స్వాహా
Warangal Fraud Case

  • రుద్రమదేవి పరపతి సంఘం డైరెక్టర్‌ ఎం.సుధాకర్‌ అరెస్టు

  • పరారీలో మరో ముగ్గురు

  • నిందితుడు సుధాకర్‌ తాజీ మాజీ కార్పొరేటర్‌ అరుణ భర్త

  • కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన మరుసటి రోజే ఘటన

  • కక్ష సాధింపు చర్య అని బీఆర్‌ఎస్‌ నాయకుల ఆరోపణ

వరంగల్: గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ 33వ డివిజన్‌ (శాంతినగర్‌) తాజా మాజీ కార్పొరేటర్‌ ముష్కమల్ల అరుణ భర్త ముష్కమల్ల సుధాకర్‌ను పరపతి సంఘం నిధుల దుర్వినియోగం కేసులో మిల్స్‌కాలనీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులుగా వున్న మరో ముగ్గురు డైరెక్టర్ల కోసం గాలిస్తున్నారు. సుధాకర్‌ దంపతులు కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లోకి మారిన మరుసటి రోజే అరెస్టు ఘటన చోటుచేసుకోవడంతో రాజకీయ రంగు పులుముకుంది. మిల్స్‌కాలనీ సీఐ కె.స్వామి తెలిపిన మేరకు కేసు పూర్వాపరాలు ఇలా వున్నాయి. వరంగల్‌ రైల్వేగేట్‌ ప్రాంతం శాంతినగర్‌లో 2015లో రుద్రమదేవి పరపతి సం ఘాన్ని స్థాపించారు. ఈ సంఘంలో సుమారు 3వేల మంది సభ్యులున్నారు.


అందరూ పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారే. నెలకు రూ.100 చొప్పు న వాటాధానం చెల్లిస్తూ వచ్చారు. ఈ సంఘానికి ముష్కమల్ల సుధాకర్‌, పూ జారి సంపత్‌ కుమార్‌, మందా శ్రీనివాస్‌, గుంటి వీరేందర్‌, గాదె మధుసూదన్‌ డైరెక్టర్లుగా వున్నారు. అయితే తొలి రెండు సంవత్సరాలు వసూలు చేసిన రూ.72లక్షలను నలుగురు డైరెక్టర్లు స్పెషల్‌ లోన్‌ పేరుతో సొంతానికి వాడుకు న్నట్టు సభ్యులు 2022లో గుర్తించారు. దీంతో 2000మంది తమ సభ్యత్వాన్ని ఉపసంహరించుకున్నారు. 2025 సెప్టెంబరు నెల నుంచి సంఘం ఆర్థిక కార్యకలాపాలను డైరెక్టర్లు పూర్తి గా నిలిపివేశారు. ఈ క్రమంలో తమకు ఒక్కొక్కరికి రావాల్సిన వాటా ధానం రూ.22వేలు చెల్లించాలని సభ్యులు సంఘం డైరెక్టర్లను పలుమా ర్లు కోరినా వారి నుంచి స్పందన రాలేదు. సభ్యులు ఇంటికి వెళితే భయభ్రాంతులకు గురిచేసే వారు.


చివరకు డైరెక్టర్‌ గాదె మధుసూదన్‌ సమక్షంలో మిగిలిన నలుగురు డైరెక్టర్లు... సభ్యులకు రూ.22 వేల చొప్పున వాటాధనం డబ్బులు త్వరలోనే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అయితే నెలలు గడుస్తున్నా డబ్బులు చెల్లించకపోవడంతో సుక్క సంతోష్‌తో పాటు పలువురు సభ్యులు ఈ నెల 19న మిల్స్‌కాలనీ పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు తెలంగాణ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ డిపాజిటర్స్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ చట్టం ప్రకారం సదరు నలుగురు డైరెక్టర్లపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని సీఐ తెలిపారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం నిందితుల కోసం వెతుకుతుండగా ముష్కమల్ల సుధాకర్‌ చిక్కారని, మిగిలిన డైరెక్టర్లు పూజారి సంపత్‌ కుమార్‌, మందా శ్రీనివాస్‌, గుంటి వీరేందర్‌ పరారీలో ఉన్నారని సీఐ తెలిపారు. సుధాకర్‌ను కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించడంతో పరకాల జైలుకు తరలించామని చెప్పారు.


రాజకీయ దుమారం

హనుమకొండలోని కేడీసీ గ్రౌండ్‌లో ఆదివారం రాత్రి బీఆర్‌ఎస్‌ జన చైతన్య సభ నిర్వహించిన విషయం విదితమే. ఈ సభలో ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమక్షంలో వరంగల్‌ తూర్పు నియోజకవర్గ పరిధిలోని తాజా మాజీ కార్పొరేటర్లు వస్కుల బాబు, ముష్కమల్ల అరుణ సుధాకర్‌, భోగి సువర్ణ సురేష్‌లు కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీలోకి మారారు. ఇది జరిగిన మరుసటి రోజు (సోమవారం) ఉదయమే ముష్కమల్ల అరుణ భర్త సుధాకర్‌ను మిల్స్‌కాలనీ పోలీసులు పరపతి సంఘం నిధుల దుర్వినియోగం కేసులో అరెస్టు చేయడంతో రాజకీయ దుమారం చోటుచేసుకుంది. కాగా, సుధాకర్‌ను పోలీసులు అరెస్టు చేయడాన్ని బీఆర్‌ఎస్‌ నాయ కులు, కార్యకర్తలు ఖండించారు. ఇది పూర్తిగా అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలో భాగమేనని వారు ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ నాయ కుడు రిజ్వాన షమీమ్‌ మసూద్‌, మాజీ కార్పొరేటర్లు మరుపల్ల రవి, భోగి సువర్ణ సురేష్‌, పలువురు కార్యకర్తలు మిల్స్‌కాలనీ పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకుని పరిస్థితిని తెలుసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఆరనీకుమా ఈ దీపం..

కరీంనగర్‌ వైద్య కాలేజీ నిర్మాణంలో జాప్యమేంటి?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 24 , 2026 | 11:27 AM