అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం.. టిప్పర్‌లో మంటలు చెలరేగి ఇద్దరి సజీవదహనం
ABN , Publish Date - Nov 24 , 2026 | 10:45 AM
అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు టిప్పర్‌లో మంటలు చెలరేగి క్లీనర్‌తో పాటు డ్రైవర్ సజీవదహనమయ్యారు.
అనకాపల్లి, నవంబరు 24: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిపై ఆగిఉన్న ట్రైలర్‌ను ఓ టిప్పర్ వెనుక నుంచి బలంగా ఢీకొంది. దీంతో టిప్పర్‌లో మంటలు చెలరేగి.. క్లీనర్, డ్రైవర్ సజీవ దహనమయ్యారు. వివరాల్లోకి వెళితే..
పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని సబ్బవరం మండలం బాటజంగాలపాలెం హైవేపై.. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బాటజంగాలపాలెం హైవేపై ఓ ట్రైలర్ నిలిపిఉండగా.. ఓ టిప్పర్ వెనుకు నుంచి వచ్చి బలంగా ఢీకొంది. ప్రమాద ధాటికి టిప్పర్ క్యాబిన్‌లో మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్ సూరి అప్పారావు (45), క్లీనర్ శ్యామ్ ప్రసాద్ (22) సజీవ దహనమయ్యారు. గమనించిన వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలనూ చదవండి: