వరంగల్ మార్కెట్లో మక్కలకు రికార్డు ధర
ABN , Publish Date - Sep 11 , 2026 | 12:14 PM
వరంగల్ (ఏనుమాముల) వ్యవసాయ మార్కెట్లో మక్కజొన్నలకు రికార్డు ధర పలికింది.
వరంగల్: వరంగల్ (ఏనుమాముల) వ్యవసాయ మార్కెట్లో గురువారం మక్కజొన్నలకు రికార్డు ధర పలికింది. గతంలో ఎన్నడూ పలుకనంత ధర పలుకడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా పెరికేడు గ్రామానికి చెందిన రైతు గణేష్ 50 బస్తాల మక్కజొన్నలను మార్కెట్‌కు తీసుకువచ్చాడు. శ్రీగోమాత అడ్తి నిర్వాహకుడి ద్వారా వాసవి కన్యకాపరమేశ్వరీ ఎంటర్‌ప్రైజెస్ నిర్వాహకుడు క్వింటాకు రూ.2,715ల చొప్పున కొనుగోలు చేశారు. దీంతో వ్యాపారులు, రైతులు, అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పాము విషానికి కొత్త విరుగుడు..
మెట్రో టేకోవర్ కోసం రుణాల వేట
Read Latest AP News And Telangana News And International News And Telugu News