కాంగోలోని పాఠశాలల్లో భారీ అగ్ని ప్రమాదం.. 26 మంది విద్యార్థుల మృతి
ABN , Publish Date - Sep 11 , 2026 | 10:43 AM
తూర్పు కాంగోలోని బుకావు నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. క్షణాల్లో చెలరేగిన మంటలు రెండు స్కూళ్లను చుట్టుముట్టడంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. ఈ విషాద ఘటనలో 26 మంది విద్యార్థులు మృతి చెందారు..
ఇంటర్నెట్ డెస్క్: తూర్పు కాంగోలోని బుకావు నగరంలో జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గురువారం ఓ ఇంట్లో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న రెండు పాఠశాలలకు వ్యాపించడంతో 26 మంది విద్యార్థులు మృతి చెందారు. మృతుల్లో 19 మంది బాలికలు, ఏడుగురు బాలురు ఉన్నట్లు దక్షిణ కివు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. డజన్ల కొద్దీ విద్యార్థులు గాయపడగా.. వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మంటలు ఫురాహా సెకండరీ పాఠశాల, ఉజమా ప్రాథమిక పాఠశాలలకు వ్యాపించడంతో విద్యార్థులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు.
మంటల నుంచి తప్పించుకునేందుకు కొందరు విద్యార్థులు కిటికీల నుంచి దూకగా, మరికొందరు ఇరుకైన ద్వారం వైపు పరుగెత్తడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. పలువురు విద్యార్థులు పొగ కారణంగా ఊపిరాడక మృతి చెందినట్లు సమాచారం. గాయపడిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఖచ్చితమైన వివరాలు సేకరించేందుకు వైద్య సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ఈ ప్రాంతంలో జనసాంద్రత అధికంగా ఉండటంతో పాటు చాలా ఇళ్లు చెక్కతో నిర్మించి ఉండటం వల్ల మంటలు వేగంగా వ్యాపించినట్లు అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కుక్కపిల్లతో ఆప్యాయంగా ఆడుతున్న బాలిక.. నెటిజన్ల ఫిదా స
హుండీలో భక్తుల కోరికల చిట్టా.. నా కోరిక నెరవేరిస్తే మందు మానేస్తా స్వామీ..!
For More Weather News And Telugu News