Share News

రైతును నిండా ముంచిన టమాటా

ABN , Publish Date - Mar 04 , 2026 | 08:46 AM

లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి కూరగాయలు పండించిన రైతు పెట్టుబడి కూడా రాకపోవడంతో నట్టేట మునిగాడు. పర్వతగిరి మండలం శ్రీనగర్‌ గ్రామానికి చెందిన విజయభాస్కర్‌ 2001 సంవత్సరం నుంచి కూరగాయలను పండిస్తున్నాడు.

రైతును నిండా ముంచిన టమాటా

  • లక్షల పెట్టుబడి, రవాణా ఖర్చు సైతం రాని వైనం

పర్వతగిరి(వరంగల్): లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి కూరగాయలు పండించిన రైతు పెట్టుబడి కూడా రాకపోవడంతో నట్టేట మునిగాడు. పర్వతగిరి మండలం శ్రీనగర్‌ గ్రామానికి చెందిన విజయభాస్కర్‌ 2001 సంవత్సరం నుంచి కూరగాయలను పండిస్తున్నాడు. ఈ సంవత్సరం రెండు ఎకరాల్లో టమాట(Tomato), ఒక ఎకరంలో వంకాయ పంట పండించాడు. ఎకరానికి లక్ష రూపాయ ల వరకు ఖర్చు చేసినట్లుగా చెబుతున్నాడు.


toma2.jpgటమాటలను మార్కెట్‌కు తీసుకెళ్లగా హోల్‌సేల్‌లో కనీసం కూలీల ఖర్చు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని, వంకాయ క్వింటా బస్తా వేయి రూపాయలు కూడా పలకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని సంవత్సరాలలో తనకు ఏనాడు ఇంత నష్టం జరగలేదని, తన టమాట పంటను ధ్వంసం చేసుకొని తొలగిస్తున్నట్లు పేర్కొన్నాడు.


ఈ వార్తలు కూడా చదవండి:

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

వేడెక్కుతున్న రాష్ట్రం

Read Latest Telangana News and National News

Updated Date - Mar 04 , 2026 | 09:48 AM