ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా ఎంత ఖర్చు చేస్తోందో తెలుసా?
ABN , Publish Date - Mar 04 , 2026 | 06:59 AM
ఇరాన్‌తో యుద్ధం కారణంగా అమెరికా భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. పలు నివేదికల ప్రకారం.. యుద్ధం ప్రారంభం అయిన మొదటి 24 గంటల్లో అమెరికా ఏకంగా 779 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.
న్యూయార్క్, మార్చి 4: ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య గత కొన్ని రోజుల నుంచి యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. అగ్రరాజ్యం అమెరికా మిత్ర దేశం ఇజ్రాయెల్‌కు అండగా నిలిచింది. ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటికే ఇరాన్‌కు చెందిన కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తి నష్టం సంభవిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ శత్రు దేశాలపై ప్రతిదాడులు చేస్తోంది. మరీ ముఖ్యంగా యూఏఈలోని అమెరికా ఏయిర్ బేస్‌లను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో అమెరికా ఎయిర్ బేస్‌లు ధ్వంసం అవ్వటంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవిస్తోంది.
యుద్ధం కోసం భారీగా ఖర్చు చేస్తున్న అమెరికా
ఇరాన్‌తో యుద్ధం కారణంగా అమెరికా భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. పలు నివేదికల ప్రకారం.. యుద్ధం ప్రారంభం అయిన మొదటి 24 గంటల్లో అమెరికా ఏకంగా 779 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. మన ఇండియన్ కరెన్సీలో అయితే 6,900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. డాటా ఫ్రమ్ ది సెంటర్ ఫర్ న్యూ అమెరికన్ సెక్యూరిటీ స్టేట్స్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్స్ (యూఎస్ఎస్ జనరల్ ఆర్ ఫోర్డ్ వంటివి) ఆపరేట్ చేయటం కోసం ప్రతీ రోజూ ఏకంగా 58 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతోంది. యుద్ధానికి సిద్ధం అవ్వటం కోసం కూడా భారీగా ఖర్చు అయింది.
ఎయిర్‌క్రాఫ్ట్‌లు, యుద్ధ నౌకలు, స్థానిక యుద్ధ సామాగ్రి తరలింపు కోసం 630 మిలియన్ డాలర్లు.. ఇండియన్ కరెన్సీలో 5,556 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. డైరెక్టర్ ఆఫ్ ది పెన్ వార్టాన్ బడ్జెట్ మోడల్ కెంట్ స్మెట్టర్స్ చెబుతున్న దాని ప్రకారం.. యుద్ధం ఇలాగే మరికొన్ని రోజులు కొనసాగితే 210 బిలియన్ డాలర్లు.. ఇండియన్ కరెన్సీలో 18.87 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవ్వనుంది. ఇదంతా ఒక ఎత్తయితే.. హమాస్‌తో యుద్ధం కారణంగా నష్టపోతున్న ఇజ్రాయెల్‌కు అమెరికా భారీ మొత్తంలో ఆర్థిక సాయం చేస్తోంది. 2023లో ఏకంగా 21.7 బిలియన్ డాలర్ల ఆర్థికసాయం అందించింది.
ఇవి కూడా చదవండి
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
10గంటల నుంచి ఆ ఏరియాల్లో కరెంట్ కట్