హైదరాబాద్ బాచుపల్లిలో అగ్నిప్రమాదం.. భారీ నష్టం
ABN , Publish Date - Mar 04 , 2026 | 07:14 AM
బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి విజ్ఞాన్ విఎన్ఆర్ కాలేజ్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కేజిఆర్ కన్వెన్షన్‌ను అనుకోని ఉన్న ఫర్నిచర్ షాప్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్: బాచుపల్లి(Bachupally) పోలీస్ స్టేషన్ పరిధి విజ్ఞాన్ విఎన్ఆర్ కాలేజ్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది. కేజిఆర్ కన్వెన్షన్(KGR Convention)ను అనుకోని ఉన్న ఫర్నిచర్ షాప్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్(Short circuit) వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో పక్కనే ఉన్న షాపులకు మంటలు వ్యాపించడంతో అందులో ఉన్న సామాన్లు కూడా దగ్ధమయ్యాయి. స్థానికులు ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.5 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.
బాచుపల్లి-మియాపూర్ ప్రధార రహదారిలోని కేజీఆర్ కన్వేన్షన్ సెంటర్ నుంచి సాయి నగర్ రోడ్డు మలుపు వరకు దాదాపు 25 ఫర్నీచర్ షాపులు ఉన్నాయి. నిమిషాల వ్యవధిలో పలు షాపులకు మంటలు వ్యాపించినట్లు సమాచారం. మంటల ధాటికి షాపులో ఉన్న కలప సామాగ్రి కాలిపోయిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొంతమంది వ్యాపారులు ఆ షాపుల్లోనే నివాసం ఉంటున్నారు. దీంతో వారు వాడే గ్యాస్ సిలిండర్లు భారీ శబ్ధంతో పేలిపోయాయి. ఆ శబ్ధానికి చుట్టుపక్కల ఉన్న జనాలు భయంతో వణికిపోయారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చంద్రగ్రహణం.. హోలీ పండగ ఎప్పుడు..?
గల్ఫ్‌లో చిక్కుకున్న వారిని క్షేమంగా తీసుకొస్తాం: మంత్రి కొండపల్లి
For More TG News And Telugu News