విషాదం నింపిన వీడియో మోజు
ABN , Publish Date - Mar 04 , 2026 | 07:38 AM
వీడియో కోసం బైక్ రైడింగ్ చేస్తుండగా అదుపు తప్పి ఓ ఇంటర్ విద్యార్థి ప్రాణాలు కోల్పోగా మరో విద్యార్థి గాయపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ
ఇంటర్ విద్యార్థి మృతితో తల్లిదండ్రుల్లో ఆందోళన
హైదరాబాద్: వీడియో కోసం బైక్ రైడింగ్ చేస్తుండగా అదుపు తప్పి ఓ ఇంటర్ విద్యార్థి ప్రాణాలు కోల్పోగా మరో విద్యార్థి గాయపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ సంఘటన సోమవారం ఫతుల్లాగూడలో జరుగగా ఆయా కుటుంబాల్లో విషాదం నింపింది. పలువురి విద్యార్థుల కుటుంబాల్లో కలవరం రేపింది. నాగోల్(Nagole)లోని రాజ్యలక్ష్మికాలనీలో నివాసం ఉంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలాపురానికి చెందిన పలివెల బుజ్జిబాబు, భవాని దంపతులకు ఫార్మా-డీ చదువుతున్న కుమార్తె తనుజ, కొత్తపేటలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న విష్ణువర్ధన్ ఉన్నారు.
బుజ్జిబాబు ఉప్పల్‌లోని ఓ కారు మెకానిక్ వర్క్‌షా్‌పలో పనిచేస్తుంటాడు. పిల్లలు ఉన్నత చదువులు చదివి.. పెద్ద స్థాయికి రావాలని కలలు కన్నాడు. చేతికి వస్తున్నాడనుకున్న కొడుకు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో ఆ తల్లిదండ్రులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. దీంతో రాజ్యలక్ష్మికాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉన్నత స్థాయిలో చూడాలనుకున్న తన కొడుకు విష్ణువర్ధన్‌ను, చివరకు మృతదేహాన్ని తీసుకొని బరువెక్కిన గుండెతో ఆ తండ్రి అమలాపురానికి వెళ్లారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఉషాకిరణ్ వనస్థలిపురం సహారా రోడ్డులోని ఇవ్యా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. చేతులు, కాలికి తగిలిన గాయాలు కిడ్నీపై ప్రభావం పడటంతో ఇతడి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపినట్లు ఉషాకిరణ్ తండ్రి రంగనాథ్ విచారం వ్యక్తం చేశారు. పిల్లలకు బైక్ ఇవ్వడం, వారు ఇష్టానుసారంగా నడపడం వల్ల జరిగే నష్టాలపై పలువురు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News