Share News

బహ్రెయిన్‌లో చిక్కుకున్న హైదరాబాద్‌ వాసులు

ABN , Publish Date - Mar 04 , 2026 | 07:10 AM

ఇరాన్‌-అమెరికా యుద్ధం కారణంగా గల్ఫ్‌ దేశాల్లోనూ పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. బహ్రెయిన్‌ రాజధాని మనామాకు వెళ్లిన హైదరాబాద్‌ రాంనగర్‌కు చెందిన పలువురు భయం భయంతో అక్కడ కాలం గడుపుతున్నారు.

బహ్రెయిన్‌లో చిక్కుకున్న హైదరాబాద్‌ వాసులు

  • తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు

రాజేంద్రనగర్‌(హైదరాబాద్): ఇరాన్‌-అమెరికా యుద్ధం కారణంగా గల్ఫ్‌ దేశాల్లోనూ పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. బహ్రెయిన్‌ రాజధాని మనామాకు వెళ్లిన హైదరాబాద్‌ రాంనగర్‌(Hyderabad Ramnagar)కు చెందిన పలువురు భయం భయంతో అక్కడ కాలం గడుపుతున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఏడుగురు బృందంగా ఫిబ్రవరి 24న బహ్రెయిన్‌కు వెళ్లారు. వారిలో కాంగ్రెస్‌ పార్టీ (కిస్టియన్‌) మైనారిటీ విభాగం రాష్ట్ర నాయకుడు గోనె సాల్మన్‌ రాజు కూడా ఉన్నారు. వారంతా ఫిబ్రవరి 28వ తేదీనే భారత్‌కు తిరిగి రావాల్సి ఉంది.


city2.jpgవారు బహ్రెయిన్‌ ఎయిర్‌పోర్టులో ఉండగానే యుద్ధ సూచనలతో విమానాలు రద్దు చేశారు. దాంతో తమతోపాటు ఎయిర్‌పోర్టులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సుమారు 150 మంది వరకు ఉన్నట్లు మంగళవారం సాల్మన్‌ రాజు తెలిపారు. తెలుగువారంతా ఎయిపోర్టుకు సమీపంలోని తెలుగు ప్రవాసీల ఇళ్లల్లో ఉంటున్నట్లు పేర్కొన్నారు. తమను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి భారత్‌కు తరలించాలని కోరారు. తెలంగాణలో హెల్ప్‌లైన్‌ నంబర్లు ఇచ్చారు కానీ, వాటికి ఫోన్‌ చేస్తే ఎవరూ తీయడం లేదని సాల్మన్‌ రాజు ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

వేడెక్కుతున్న రాష్ట్రం

Read Latest Telangana News and National News

Updated Date - Mar 04 , 2026 | 07:11 AM