Share News

10గంటల నుంచి ఆ ఏరియాల్లో కరెంట్ కట్

ABN , Publish Date - Feb 21 , 2026 | 06:44 AM

టీజీఎస్‏పీడీసీఎల్‌ బాలాజీనగర్‌ సెక్షన్‌ పరిధిలో 220కేవీ లైన్‌, సమ్మర్‌ యాక్షన్‌ పనులు జరుగుతున్నాయి. దీంతో సబ్‌స్టేషన్స్‌లో మరమ్మతుల నేపథ్యంలో శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ భీమాలింగప్ప ఓ ప్రకటనలో తెలిపారు.

10గంటల నుంచి ఆ ఏరియాల్లో కరెంట్ కట్

  • నగరంలో నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలు

కేపీహెచ్‌బీకాలనీ(హైదరాబాద్): టీజీఎస్‏పీడీసీఎల్‌ బాలాజీనగర్‌ సెక్షన్‌ పరిధిలో 220కేవీ లైన్‌, సమ్మర్‌ యాక్షన్‌ పనులు జరుగుతున్నాయి. దీంతో సబ్‌స్టేషన్స్‌లో మరమ్మతుల నేపథ్యంలో శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ భీమాలింగప్ప ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు కేపీహెచ్‌బీ ఏడోఫేజ్‌, శివశక్తినగర్‌, అల్‌సబా హోటల్‌, టి.అంజయ్యనగర్‌, మూసాపేట్‌ వార్డు ఆఫీస్‌ ప్రాంతాల్లో.. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆంజనేయనగర్‌ మహిళా మండలి, మూసాపేట్‌ చిత్తారమ్మ టెంపుల్‌ పరిసర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదన్నారు.


ఉప్పల్‌: మరమ్మతుల కారణంగా శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నామని ఏఈ వినయ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హేమానగర్‌ ఫీడర్‌ పరిధిలో సాయి భవానీనగర్‌, గాయత్రి హిల్స్‌, మల్లయ్యనగర్‌, వాసవీనగర్‌, అనుశ్రీనగర్‌, నార్త్‌ బాలాజీ హిల్స్‌, సప్తగిరి కాలనీ, తిరుమల మెడోస్‌, హేమానగర్‌, లక్ష్మీగణపతి కాలనీ, శాన్వి హైట్స్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని పేర్కొన్నారు.


city1.jpgచర్లపల్లి సబ్‌స్టేషన్‌ పరిధిలో..

కుషాయిగూడ: విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు, లైన్‌ల మార్పు కారణంగా చర్లపల్లి సబ్‌-స్టేషన్‌ అంబేడ్కర్‌ నగర్‌ ఫీడర్‌ పరిధిలో శనివారం విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నామని ఏఈ ఎ. భాబూరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు చిన్న చర్లపల్లి, చర్చ్‌ కాలనీ, రాజీవ్‌గృహకల్ప, వీఆర్‌ కాలనీ, విద్యామారుతీ నగర్‌, అంబేడ్కర్‌నగర్‌, సిల్వర్‌ ఓక్‌ విల్లాస్‌, నేతాజీనగర్‌, లక్ష్మీనగర్‌, డీసీ కాలనీలో విద్యుత్‌ సరఫరా ఉండదని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మెడికల్‌ పీజీ కోర్సులకు లైన్‌ క్లియర్‌

చరిత్రను తిరగరాసిన సరిత

Read Latest Telangana News and National News

Updated Date - Feb 21 , 2026 | 06:45 AM