Share News

ఉద్యోగుల సమ్మెతో పీఏసీఎస్‌ల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

ABN , Publish Date - Feb 21 , 2026 | 05:50 AM

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) ఉద్యోగుల నిరవధిక సమ్మె నేపథ్యంలో రైతులకు అసౌకర్యం కలగకుండా..

ఉద్యోగుల సమ్మెతో పీఏసీఎస్‌ల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

అమరావతి, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) ఉద్యోగుల నిరవధిక సమ్మె నేపథ్యంలో రైతులకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టింది. డీసీసీబీల్లోని సూపర్‌వైజర్లు, స్టాఫ్‌ అసిస్టెంట్లను పీఏసీఎస్‌ల్లో ఇన్‌చార్జిలుగా తాత్కాలిక పద్ధతిలో నియమించడానికి అనుమతించింది. ఈమేరకు డీసీసీబీలకు తగిన ఆదేశాలు జారీ చేసేలా ఆప్కాబ్‌ ఎండీకి సహకార శాఖ కమిషనర్‌ అహ్మద్‌బాబు లేఖ రాశారు.

Updated Date - Feb 21 , 2026 | 05:50 AM