కాళేశ్వరంలో గవర్నర్ దంపతుల పుష్కర స్నానం..
ABN , Publish Date - May 21 , 2026 | 09:17 PM
కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ అంత్య పుష్కరాలకు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు మంత్రి శ్రీధర్ బాబుతో పాటు జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు.
జయశంకర్ భూపాలపల్లి, మే 21 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ అంత్య పుష్కరాలకు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా (Governor Shiv Pratap Shukla) దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు మంత్రి శ్రీధర్ బాబుతో పాటు జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత గవర్నర్ దంపతులు కాళేశ్వరం త్రివేణి సంగమ తీరంలో పవిత్ర పుష్కర స్నానం ఆచరించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గవర్నర్ దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో గవర్నర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న వారికి రాజగోపురం వద్ద అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆలయ మర్యాదలతో స్వాగత కార్యక్రమం జరిగింది. జ్ఞాన సరస్వతి ఘాట్ వద్ద నిర్వహించిన నదీహారతి, తెప్పోత్సవం కార్యక్రమాల్లో కూడా గవర్నర్ దంపతులు పాల్గొన్నారు. గంగాహారతి కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో పెద్దసంఖ్యలో భక్తులు హాజరయ్యారు. గవర్నర్ దంపతులు రాత్రి కాళేశ్వరంలోనే బస చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి...
సరస్వతీ అంత్య పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు.. భక్తులకు సీఎం శుభాకాంక్షలు
కేసీఆర్ కుటుంబ పాలనను అంతం చేశాం: బండి సంజయ్
ఆ ఆస్పత్రులు ఉచిత సేవలు ఇవ్వాల్సిందే: సుప్రీంకోర్టు
Read Latest Telangana News And AP News And International News And Telugu News