Share News

సీతాఫలాల సీజన్‌ షురూ.. పాలకుర్తి మార్కెట్‌లో కిలో రూ.150

ABN , Publish Date - Oct 27 , 2026 | 12:51 PM

ఆరోగ్య ప్రదాయినిగా పేరున్న సీతాఫలాలు మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. పోషకాలు పుష్కలంగా ఉండడంతో వీటిని తినేందుకు జిల్లా వాసులు ఆసక్తి చూపుతున్నారు. సీతాఫ లాల సీజన్‌ కావడంతో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

సీతాఫలాల సీజన్‌ షురూ.. పాలకుర్తి మార్కెట్‌లో కిలో రూ.150
TG News, Warangal

  • పోషకాలు ఘనం.. సీతాఫలం

  • మార్కెట్‌లో పండ్ల సందడి

  • పోషకాలు పుష్కలంగా ఉండడంతో కొనుగోలుకు ఆసక్తి

  • కిలో రూ.100 నుంచి రూ.150 ధర

పాలకుర్తి(వరంగల్): ఆరోగ్య ప్రదాయినిగా పేరున్న సీతాఫలాలు మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. పోషకాలు పుష్కలంగా ఉండడంతో వీటిని తినేందుకు జిల్లా వాసులు ఆసక్తి చూపుతున్నారు. సీతాఫ లాల సీజన్‌ కావడంతో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పెద్ద సంఖ్యలో పల్లెల నుంచి సీతాఫలాలను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. మార్కెట్‌లో కిలో రూ.100 నుంచి రూ.150 ధర పలుకుతోంది. అయినా కొనుగోలు చేసేందుకు జనం ఇష్టపడుతున్నారు.


hnk3.2.jpgసీతాఫలంలో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, పీచు పదార్థాలు అత్యధి కంగా ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు. విటమిన్‌-సీ,క్యాల్షియం, ఫాస్పరస్‌ పొటాషియం, మెగ్నిషీయం లాంటి ఖనిజ లవణాలు ఫలం సొంతం. సీతాఫలం తింటే ఎముకలు బలంగా ఉండడమేకాక, జీర్ణక్రియ వేగవంతానికి, మల బద్ధకానికి దివ్యఔషదంగా పని చేస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు.


hnk3.3.jpgపెరిగిన ధరలు..

ఈ ఫలాలు సీజన్‌ ఇప్పుడే ప్రారంభమైంది. ధరలు కూడా అంతే దూరంలో ఉందకుండా పోతున్నాయి. సూర్యాపేట, జనగామ, మహ బూబాబాద్‌ పట్టణాల నుంచి తీసుకువచ్చి పాలకుర్తి వారంతపు సంతలోనూ, పాలకుర్తి రాజీవ్‌ చౌరస్తాలో నాలుగు రోడ్ల కూడలిలో ఈ పండ్ల విక్రయాలు జరుపుతున్నారు. కిలో సీతా ఫలాలు రూ.100, రూ.150 ధర పలుకుతుంది. ఈ పండ్లలో రకాలు చిన్నవి, పెద్దవిగా ఉన్నా యి. పెద్దవి ఐదు పండ్లకు రూ. 150 పలుకుతు న్నాయి. చిన్నవి ఒక్క పండుకు రూ.20 పలుకు తోంది. ధరలు ఎక్కువగా పలుకుతున్న ప్పటికి కొనుగోలు మాత్రం తప్పడం లేదు.


ఈ వార్తలు కూడా చదవండి:

ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో రాతి గుహ

పనులు చేయకపోయినా బిల్లులు!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 27 , 2026 | 12:51 PM