Share News

పల్లెల్లో ఈత కల్లు జోరు

ABN , Publish Date - Oct 24 , 2026 | 12:18 PM

దసరా పండుగ ముందు నుంచే పల్లెల్లో ఈత కల్లు జోరు కొనసాగుతోంది. పల్లె శివార్లలో వరుసగా కనిపించే ఈత చెట్లు.. గ్రామీణ జీవ నానికి, ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధా నికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి.

పల్లెల్లో ఈత కల్లు జోరు
TG News, Warangal

  • తెల్లవారుజామునే మోకుతో చెట్ల బాట పడుతున్న గీత కార్మికులు

  • ఎగబడుతున్న కల్లు ప్రియులు

  • ఆరోగ్యానికి మేలంటున్న వైద్యులు

నర్సంపేట(వరంగల్): దసరా పండుగ ముందు నుంచే పల్లెల్లో ఈత కల్లు జోరు కొనసాగుతోంది. పల్లె శివార్లలో వరుసగా కనిపించే ఈత చెట్లు.. గ్రామీణ జీవ నానికి, ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధా నికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. అక్టోబరు నుంచి డిసెంబరు వరకు పల్లెల్లో ప్రత్యేక వాతావరణం తరతరలాలుగా కొనసాగుతోంది. ప్రజలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన నీరా ఉదయం, సాయంత్రం వేళల్లో అందుబాటులో దొరుకుతోంది. అలాగే సాయంత్రం తర్వాత సహజ సిద్ధమైన ఈత కల్లు కూడా అందు బాటులో ఉంది. తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి చెట్లు ఎక్కి కల్లు గీత కార్మి కులు నీరా సేకరిస్తున్నారు. నీరా తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుందని, జీర్ణశక్తి పెరు గుతుందని వైద్యులు తెలుపుతున్నారు. కెమిక ల్‌ లేని సహజ పానియం కావడంతో ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నర్సంపేట డివిజన్‌లోని నర్సంపేట, చెన్నారావుపేట, ఖానాపురం, నెక్కొండ మండలాల్లో ఈతకల్లు ప్రస్తుతం విరివిగా లభిస్తోంది. వేల మంది గీత కార్మికులు ఈతకల్లు ద్వారా ఉపాధి పొందుతున్నారు.


kallu.jpgపల్లె సంస్కృతిలో భాగం..

తెలంగాణలో గీత వృత్తికి సుదీర్ఘ చరిత్ర ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈత, తాటి చెట్లు కేవలం చెట్లుగానే కాకుండా.. అనేక కుటుం బాల జీవనోపాధితో ముడిపడి ఉన్నాయి. పండుగలు, జాతరలు, గ్రామీణ సంప్రదాయా ల్లోనూ ఈ చెట్లకు ప్రత్యేక ప్రాధాన్యం కనిపిస్తుంది. ఆధునిక జీవన విధానం వేగంగా మారుతున్నప్పటికీ సంప్రదాయ వృ త్తులపై ఆధారపడే కుటుంబాలు ఇప్పటికీ గ్రా మీణ ప్రాంతాల్లో కనిపిస్తూనే ఉన్నాయి. ఈత, తాటి చెట్ల సంరక్షణతో పాటు గీత కార్మికుల జీవనోపాధికి భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.


చెట్ల పరిరక్షణే భవిష్యత్‌కు భరోసా

పట్టణీకరణ, రహదారుల విస్తరణ, భూము ల వినియోగంలో మార్పులతో గ్రామ శివార్ల లోని సంప్రదాయ చెట్ల సంఖ్య తగ్గుతున్న ప్రాంతాలు ఉన్నాయి. దీంతో ఈత, తాటి చెట్ల ను సంరక్షించడంతో పాటు కొత్తగా మొక్కలు నాటి పెంచాల్సిన అవసరం ఉందని ప్రకృతి ప్రేమికులు పేర్కొంటున్నారు. చెట్లు ఉంటేనే వాటిపై ఆధారపడిన సంప్రదాయ వృత్తులు కూడా కొనసాగుతాయని చెబుతున్నారు.


hml1.2.jpgచెట్ల బాట

వర్షాకాలం ముగిసి చలికాలం ప్రారంభమ య్యే అక్టోబరునుంచి డిసెంబరు వరకు గ్రామీ ణ ప్రాంతాల్లో వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. తెల్లవారుజామున పొలాలపై మంచు తెరలు కమ్ముకుంటే.. గ్రామ శివార్ల లోని ఈత చెట్ల వరుసలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ సమయంలో గీత కార్మికు లు తెల్లవారుజామునే తమ పనులను ప్రారం భిస్తారు. చెట్టు ఎక్కేందుకు ఉపయోగించే మోకు, ముత్తెతాడు గీత కార్మికుడి వృత్తిలో కీలక సాధనాలు. అనుభవం, నైపుణ్యంతో ఎత్తైన చెట్లను అధిరోహిస్తూ రోజువారీ పనిని కొనసాగిస్తారు.

ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు..

ఈత కల్లు నర్సంపేట డివిజన్‌లోని మండలాల్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటుగా అమ్ముతున్నారు. రెండు లీటర్ల బాటీల్‌ రూ. 150 నుంచి 200వరకు అమ్ముతున్నారు. చిన్న బాటిళ్లు రూ.50 నుంచి 100 వరకు అమ్ము తున్నారు. చెన్నారావుపేట, నెక్కొండ మండలా ల్లో రూ. 150 అమ్ముతున్నారు.


ఈత కల్లు సహజసిద్ధ పానీయం

  • డాక్టర్‌ రాంచందర్‌, నర్సంపేట

ఈత కల్లు ఎలాంటి కృత్రిమ రసాయనాలు కలపకుండా సహజంగా తయారవుతుంది. ఉదయం పూట తీసే తాజా ఈత కల్లులో బీ కాంప్లిమెంట్‌ విటమిన్లు (ముఖ్యంగా బీ 12), అమినో ఆమ్లాలు, కొన్ని ఖనిజా లు ఉంటాయి. ఎండాకాలంలో శరీరాన్ని చల్లబరచడానికి, వేడిని తగ్గించడానికి కొందరు దీనిని సహజ పానీయంగా సేవిస్తుంటారు. మితంగా తీసుకుంటే జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.


ఈ వార్తలు కూడా చదవండి:

ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లతో జర జాగ్రత్త!

మీ-సేవలోడ్రైవింగ్‌ లైసెన్సు వీడియో!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 24 , 2026 | 12:18 PM